ETV Bharat / bharat

Volunteers in AP: వాలంటీర్లలో అసాంఘిక రత్నాలు.. వారి నైజం ఇదే..! - Volunteers System in Andhra pradesh

Volunteer System in AP: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై పెద్ద దుమారం రేగుతోంది. కొందరు వాలంటీర్లు తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటున్నారు. అరాచకాలు, అకృత్యాలకు పాల్పడుతూ.. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలు నిర్వహిస్తున్నామనే ముసుగులో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.

volunteers
volunteers
author img

By

Published : Jul 13, 2023, 7:30 AM IST

Updated : Jul 13, 2023, 7:50 AM IST

వాలంటీర్లలో అసాంఘిక రత్నాలు.. వారి నైజం ఇదే..!

Volunteer System in AP: గ్రామ, వార్డు వాలంటీర్లు వారికి అప్పగించిన బాధ్యతల నిర్వహణకే పరిమితమవుతున్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు, ప్రలోభాలకు తలొగ్గకుండా విధులు నిర్వహిస్తున్నారు. సామాజిక భద్రత పింఛన్లు ఇంటి వద్దకే వెళ్లి అందిస్తున్నారు. ఇలాంటి వారిని ఎవరూ తప్పుపట్టరు. కానీ కొందరు వాలంటీర్లు మాత్రం అరాచకాలు, అకృత్యాలకు పాల్పడుతున్నారు.

ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలు నిర్వహిస్తున్నామనే ముసుగులో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అత్యాచారాలకు తెగబడుతున్నారు. లైంగికంగా వేధిస్తున్నారు. బాలికలను మాయమాటలతో మోసగిస్తున్నారు. హత్యలు చేస్తున్నారు. మద్యం అక్రమ రవాణా, నాటుసారా తయారీ, భౌతిక దాడులు, భూకబ్జాలు, గంజాయి స్మగ్లింగ్, ప్రజల నుంచి సొమ్ములు వసూలు చేసి పరారవటం ఇలా అనేక నేరాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఏ వారం రోజులు దినపత్రికలు తిరగేసినా వాలంటీర్ల మోసాలు, నేరాలు కనీసం నాలుగైదు కనిపిస్తాయి. అసలు బయటకు తెలియనివి, వైఎస్సార్​సీపీ నాయకుల ఒత్తిడితో కేసులు లేకుండా చేసుకుంటున్నవీ లెక్కే లేదు.

వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలే: వైఎస్సార్​సీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించామని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు అంబటి రాంబాబు, తానేటి వనిత తదితరులు బహిరంగ వేదికలపైనే ప్రకటించారు. వాలంటీర్లు వైఎస్సార్​సీపీ ఘన విజయానికి కృషి చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్‌ గతంలో పిలుపునిచ్చారు. వేరే పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఉద్యోగాలు ఉండవు అని మరో మంత్రి పినిపే విశ్వరూప్‌ హెచ్చరించారు. వాలంటీర్లు వైఎస్సార్​సీపీ కోసం పనిచేయాలని మంత్రులే చెప్పటం కంటే దారుణం ఏముంటుంది?.

ఒక్కరోజులో ఎన్నో..: జులై 11.. రాత్రి 8 గంటల సమయం.. గుంటూరు శ్రీరాంనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి వాలంటీర్‌తో కలిసి సచివాలయ సిబ్బంది ప్రవేశించారు. ఓ ప్లాట్‌ తలుపు కొట్టారు. తలుపు తీయగానే ఇంట్లోని మహిళల ఫొటోలు తీశారు. ఆ తర్వాత మాజీ MLA ఇంటి తలుపుతట్టారు. అక్కడా అదే హంగామా. ఆగ్రహించిన మహిళలు నిలదీశారు. ఫొటో ఎందుకు తీశారంటూ నిర్బంధించారు. అసలు.. ఫొటోలు తీయాల్సిన అవసరం వాలంటీర్‌కు ఏంటన్నది ఇక్కడ ప్రశ్న..? ఫొటోలు దుర్వినియోగం అయితే బాధ్యత ఎవరిదన్నది మహిళల ఆవేదన..? దానికి వాలంటిర్‌ చెప్పిన సమాధానం జగనన్న సురక్ష పథకం మ్యాపింగ్‌ అట..! దానికి వేళాపాలా లేదా? రాత్రి 8గంటల సమయంలో.. ఫొటోలు తీయాల్సిన అర్జెంటు పనా అది.?

ఇంకోటి నంద్యాల జిల్లా సున్నిపెంట వాలంటీర్‌ ఎలకపాటి పవన్‌పై.. నమోదైన FIR!. ఓ యువతి అశ్లీల చిత్రాలు తీసి,. వాటిని అడ్డుపెట్టుకుని వేధించాడన్నది అభియోగం. మంత్రి మేరుగు నాగార్జున వాలంటీర్లను.. దైవాంస సంభూతులుగా కీర్తించిన రోజే.. ఈ వాలంటీర్‌ బూతు బాగోతం బయటికొచ్చింది.

ఇక ఇంకో ఘనుడు విశాఖ జిల్లా కుసర్లపూడి గ్రామ వాలంటీర్ నానాజీ. ఏప్రిల్‌ మూడో తేదీన అదే గ్రామానికి చెంది పదో తరగతి బాలికపై అత్యాచార యత్నానికి.. తెగించాడు. రోలుగుంట PSలో కేసు కూడా నమోదైంది. దిశ చట్టం అమల్లో ఉంటే.. ఈపాటికి ఇతనికి శిక్ష పడేదేమో..!. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రావినూతల గ్రామ సచివాలయం-2 లో.. వాలంటీర్​గా పని చేసిన రావిపాటి కోటయ్యకు పెళ్లి కూడా అయింది. కానీ.. పదిహేనేళ్ల బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 3నెలల తర్వాత తల్లిదండ్రుల ఫిర్యాదుతో విషయం వెలుగులోకొచ్చింది. ఒంటరి మహిళల్ని వేధించడం,. అమ్మాయిల వెంటపడడం.. ఎవరికైనా చెప్తే పథకాలు తీసేస్తామంటూ బెదిరించడం.. వంటి ఫిర్యాదులూ.. ఉదంతాలు కొకొల్లలు..

వాలంటీర్లలో ఇలాంటి రత్నాలే కాదు..! కోతముక్కల్లో పట్టుబడిన పేకాట రాయుళ్లు, అక్రమ మద్యం అమ్ముతూ పట్టుబడిన మందురత్నాలు.. ఇలా చాలా మంది ఉన్నారు. అనంతపురం జిల్లా కోనంపల్లి వాలంటీర్ శ్రీధర్ తన సొంత వాహనంలో కర్ణాటక నుంచి ఏకంగా 20 కేసుల మద్యం తరలిస్తూ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. మరో ఘటనలో బాపట్ల జిల్లా.. చెరుకుపల్లి సచివాలయం పరిధిలో వాలంటీర్‌గా పనిచేసిన.. నోవాబాబును.. అక్రమ మద్యం అమ్ముతుండగా సెబ్‌ అధికారులు పట్టుని ఫోలీసుస్టేషన్​లో కూర్చోబెట్టారు. ఇక ప్రకాశం జిల్లా పామూరులో ఓ వాలంటీర్‌.. ఇద్దరితో కలిసి విదేశీ మద్యం అమ్ముతూ పోలీసులకు చిక్కాడు. నిజానికి అక్రమ మద్యం ఎక్కడైనా కనిపిస్తే.. పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన వాలంటీర్లే.. ఇలా దొంగమద్యం అమ్ముతూ.. పోలీసులకు చిక్కారు. కానీ గుట్టుచప్పుడు కాకుండా చాలా మంది ఈ దందా సాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

వాలంటీర్‌ కొలువును అడ్డుపెట్టుకుని గ్రామాల్లో.. కొందరు దందాలు చేస్తున్నారనే విమర్శలూ.. లేకపోలేదు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండగుంపాం గ్రామ వాలంటీర్‌గా పనిచేసిన శ్రీలేఖ,.. పప్పులు చీటీల పేరుతో.. సుమారు నాలుగున్నర కోట్లకు ఎగనామం పెట్టింది. సంక్రాంతి పండగకు సరుకులు ఇస్తామంటూ.. 1250 మంది నుంచి నెలకు 300 వందల చొప్పున వసూలు చేసింది. ఏడాదిపాటు నడిచిన ఈ వసూల్ రత్న దందా.. బాధితులంతా మూకుమ్మడిగా రోడ్డెక్కితేగానీ బయటకు రాలేదు.

అనంతపురం జిల్లా మడకశిర మూడోవార్డు వాలంటీర్‌గా పనిచేసిన ఈరప్ప.. కత్తిగాటుతో ఆస్పత్రి బెడ్ ఎక్కాడంటే ప్రాణాలకు తెగించిన సేవారత్న అనుకునేరు!. వాలంటీర్‌ కేటగిరీలో డ్రామారత్న అవార్డు లేదుగానీ లేదంటే ఈరప్పకు కచ్చితంగాఆ పురస్కారం ఇచ్చేవారేమో. వృద్ధులకు పంచాల్సిన పింఛన్‌ డబ్బులపై కన్నేసిన ఈరప్ప.. తన కల్లలో కారం చల్లి ఎవరో నలుగురు దారిదోపిడీ చేశారంటూ గొప్ప కట్టుకథే అల్లాడు. ఎవరికీ అనుమానం రాకుండా.. ఇలా కత్తిగాటూ పెట్టుకున్నాడు. ఆ దొంగ నాటకానికి పోలీసులు తెరదించడంతో.. డ్రామా రత్న అవార్డ్‌ మిస్‌ అయింది.

కొందరు వాలంటీర్ల అఘాయిత్యాలు, అరాచకాలు, దురాగతాలకు ఇవి కొన్ని ఉదాహరణలే. కేవలం బయటికొచ్చిన బాగోతాలే. రానివి చాలానే ఉంటున్నాయి. కొన్ని బయటికొచ్చినా.. అధికారపార్టీ పెద్దలు చెప్పినట్లు వాలంటీర్లలో 90 శాతం వైఎస్సార్​సీపీ కార్యకర్తలే కావడంతో.. రాజీ చేసుకుంటున్నారు. వాలంటీర్ల విధులను ఎవరూ తప్పుపట్టడంలేదు. అధికారదర్పం ప్రదర్శిస్తూ అసాంఘిక శక్తులుగా తయారవుతున్న వారిపట్లే.. ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు చేర్చడమే వాలంటీర్‌ వ్యవస్థని.. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ప్రకటించినా.. వారిని ప్రైవేటు సైన్యంలా మార్చేసుకుని ప్రజల వ్యక్తిగత వివరాలు, రాజకీయ ఆసక్తుల వంటి సమాచారం సేకరిస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ కానీ, సంబంధిత మంత్రులుగానీ వాలంటీర్ల అరాచకాలపై.. ఒక్కసారైనా సమీక్షించలేదు. కనీసం వాటిని ఖండించలేదు. తాజాగా ఓట్ల తొలగింపు వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వాలంటీర్ల తీరు మరిన్ని విమర్శలకు తావిచ్చింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాటిని ప్రజల్లో పెట్టడంతో.. మరింత చర్చనీయాంశమైంది.

Last Updated : Jul 13, 2023, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.