Vision 2047 Document Releases by TDP President Chandrababu: తన దూరదృష్టి వల్లే నేడు హైదరాబాద్‌లో ఎక్కువ తలసరి ఆదాయం ఉందని చంద్రబాబు అన్నారు. ఇండియా, ఇండియన్స్, తెలుగూస్ పేరుతో విజన్ డాక్యుమెంట్‌ను చంద్రబాబు విడుదల చేశారు. జీఎఫ్‌ఎస్‌టీ ఛైర్మన్ హోదాలో డాక్యుమెంట్ తయారీకీ చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేశారు. మన ఆర్థిక విధానాల వల్ల 1991 వరకు దేశాభివృద్ధి పెద్దగా లేదన్న చంద్రబాబు.. 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల శక్తిమంతంగా మారామని తెలిపారు.
వందేళ్ల పంద్రాగస్టు వేడుకకు భారత్ సూపర్ పవన్ కావాలి: 90ల్లో వచ్చిన ఇంటర్‌నెట్ రివల్యూషన్ వల్ల ప్రపంచంలో పెను మార్పులు వచ్చాయన్నారు. విభజన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2029కు పిలుపు ఇచ్చామని తెలియజేశారు. వందేళ్ల పంద్రాగస్టు వేడుక నాటికి భారత్ సూపర్ పవర్ అవుతుందని చంద్రబాబు ఆకాంక్షించారు.
సెల్‌ఫోన్ తిండి పెడుతుందా అని ఎగతాళి చేశారు: కాలుష్యం లేని విద్యుత్ ఉత్పత్తి పెంచేలా చర్యలు చేపట్టాలని కోరారు. సెల్‌ఫోన్ తిండి పెడుతుందా అని ఆనాడు ఎగతాళి చేశారన్న చంద్రబాబు.. ఇప్పుడు సెల్‌ఫోన్‌తో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు. పెరుగుతున్న యువత దేశాభివృద్ధికి చాలా కీలకంగా మారతారని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం తేవాలని ఆకాంక్షించారు.
21వ శతకం మనదే.. అనుమానమే లేదు: చైనా కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారాలని.. 21వ శతకం మనదే అవుతుందని, అందులో అనుమానమే లేదని చంద్రబాబు చెప్పారు. 2047లోగా సంక్షేమం, అభివృద్ధి, సాధికారత రావాలని ఆకాంక్షించారు. పేదరికం లేని సమాజం కోసమే పీ-4 మోడల్ ప్రకటించానని చంద్రబాబు అన్నారు.
తగిన ప్రణాళికలు రూపొందించాలి: యువత కోసం ఎంప్లాయిమెంట్ ట్రాకింగ్ సిస్టమ్ రూపొందించాలని.. హైబ్రిడ్ వర్కింగ్ సద్వినియోగానికి తగిన ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. 2047 నాటికి 10 కోట్లమంది ఎన్‌ఆర్‌ఐలు ఉండేలా చూడాలన్నారు. నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతులు త్వరగా పెంచాలని తెలిపారు.
నదులను త్వరగా అనుసంధానం చేయాలి: 2030 నాటికి కర్బన ఉద్గారాలను 40 శాతం తగ్గించాలని చంద్రబాబు కోరారు. స్థానికంగా ఇంధనోత్పత్తి, వినియోగం, గ్రిడ్ల ఏర్పాట్లపై దృష్టి పెట్టాలన్నారు. సీఎన్‌జీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, సరఫరాపై దృష్టి సారించాలని.. ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి నీటినిల్వ సామర్థ్యం భారీగా పెంచాలని తెలిపారు. దేశంలోని 37 ప్రధాన నదులను త్వరగా అనుసంధానం చేయాలని చెప్పారు.
మేధావులు చర్చించాలి: ఈ విజన్ డాక్యుమెంట్ డ్రాఫ్ట్ మాత్రమే అని పేర్కొన్న చంద్రబాబు.. దీనిపై మేధావులు చర్చించాలని కోరారు. దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి బాగా పెంచాలని తెలిపారు. సౌర విద్యుత్ యూనిట్ ధరను బాగా తగ్గించగలిగామని.. సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచాలని అన్నారు.
విజన్ 2047 డాక్యుమెంట్‌లో ఐదు స్ట్రాటజీలు పేర్కొన్న చంద్రబాబు.. డాక్యుమెంట్‌లో ఇండియన్ ఎకానమీ యేజ్ గ్లోబల్ ఎకానమీ గురించి ప్రస్తావించారు. డాక్యుమెంట్‌లో డెమొగ్రఫిక్ మేనేజ్‌మెంట్, పీ-4 మోడల్ ఆఫ్ వెల్ఫేర్ గురించి ప్రస్తావించారు. విజన్ డాక్యుమెంట్‌లో రీసెర్చ్ ఇన్నొవేషన్, టెక్నాలజీ గురించి.. పునరుత్పాదక ఇంధన వనరుల ఆవశ్యకత గురించి, వాటర్ సెక్యూర్ ఇండియా గురించి చంద్రబాబు వివరించారు.
అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా: ప్రపంచంలోని అన్ని దేశాల్లో భారతీయులు ఉన్నారన్న చంద్రబాబు.. మనదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని కోరుకోవాలని అన్నారు. దేశాభివృద్ధిలో తెలుగుజాతి ప్రముఖ పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. విజయవాడ, గుంటూరు మధ్య అమరావతి నగరం తలపెట్టామన్న చంద్రబాబు.. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా మార్చాలని అనుకున్నామని తెలిపారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో 10 ప్లస్ గ్రోత్ రేట్ సాధించామని అన్నారు. విశాఖ ప్రజలు కూడా అమరావతి కావాలని కోరుకుంటున్నారని.. వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే శక్తి భారత్‌కు ఉందని అన్నారు.
పిల్లల చదువుపై తల్లిదండ్రులకు విజన్ ఉండాలి: విజన్ ఉన్న తల్లిదండ్రుల పిల్లలు ఉన్నత స్థానాలకు వెళ్తారని చంద్రబాబు అన్నారు. 2047లో వందేళ్ల స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటామని.. అప్పటికి ఏ విధంగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయో ఆలోచించాలని సూచించారు.
హత్యా రాజకీయాలు చేయను.. అలా చేసేవారిని రాజకీయంగా భూస్థాపితం చేస్తా: చంద్రబాబు