Vice president Venkaiah Naidu Corona: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు రెండోసారి కరోనా సోకింది. ఆదివారం నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలిపింది.
వైద్యుల సూచనల మేరకు వారం రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు పేర్కొంది. ఆయనతో కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాలని, స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచించింది.
2020, సెప్టెంబర్ 30న తొలిసారి..
2020, సెప్టెంబర్‌లో తొలిసారి కరోనా బారినపడ్డారు వెంకయ్య. సెప్టెంబర్ 30న నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. స్వల్ప లక్షణాలతో వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుని కోలుకున్నారు. పార్లమెంట్ వర్షకాల సమావేశాలకు హాజరైన తర్వాత ఈ పరీక్షలు నిర్వహించారు. ఆయనతో పాటు మరో 25 మందికి వైరస్ సోకింది.
పార్లమెంట్లో 875 మందికి కరోనా..
పార్లమెంట్లో ఇప్పటి వరకు 875 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అందులో రాజ్యసభ సచివాలయంలోనే 271 మందికి కొవిడ్ సోకింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: 'దేవుడిపై ఒట్టు.. పార్టీ మారం'.. ప్రమాణం చేయిస్తున్న కాంగ్రెస్