ETV Bharat / bharat

దక్షిణాదిలో వందేభారత్ కూత.. 6గంటల్లోనే చెన్నై నుంచి మైసూర్​​కు ప్రయాణం - మైసూర్​ రైల్వే స్టేషన్​కు వందేభారత్​​ రైలు

వందేభారత్​​​ రైలు దక్షిణాదిలోకి పెట్టనుంది. శుక్రవారం బెంగళూరులో ప్రధాని దీన్ని ప్రారంభించనున్నారు. చెన్నై, బెంగళూరు, మైసూర్​ల మీదుగా ఈ సెమీ హైస్పీడ్​ ఎక్స్​ప్రెస్​​ నడవనుంది. ప్రారంభోత్సవం నేపథ్యంలో చేపట్టిన ట్రయల్ రన్ విజయవంతమైంది.

southindia first vande bharat train
దక్షిణాదిలో వందేభారత్​​​ రైలు
author img

By

Published : Nov 7, 2022, 5:23 PM IST

దక్షిణ భారతదేశంలో మొదటి వందేభారత్​​ రైలు పట్టాలపై పరుగులు పెట్టనుంది. నవంబర్​ 11 న ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో దీన్ని ప్రారంభించనున్నారు. చెన్నై, బెంగుళూరు, మైసూర్​ల మీదుగా ఈ రైలు నడవనుంది. ప్రారంభోత్సవానికి ముందు ట్రయల్ రన్ చేపట్టగా... చెన్నై నుంచి మైసూరుకు కేవలం ఆరు గంటల్లోనే రైలు చేరుకుందని అధికారులు తెలిపారు.

ఉదయం 6 గంటలకు చెన్నై నుంచి ఈ రైలు బయలుదేరింది. 504 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన అనంతరం మైసూర్​కు చేరుకుంది. ఈ ప్రయాణానికి 6 గంటల 12 నిమిషాల సమయం పట్టింది. ఈ రైలుకు అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసినట్లు రైల్వే టెక్నికల్ విభాగం అధిపతి అఖిల రంజన్​ తెలిపారు. ఇందులో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదన్నారు. ఈ వందే భారత్ రైలును దేశీయంగా అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.

ఈ వందేభారత్​ ప్రత్యేకతలు
1. ఈ హై-స్పీడ్ రైలులో ప్రత్యేకంగా రూపొందించిన బోగీలు ఉంటాయి.
2. రైలులోని అన్ని బోగీలలో ఏసీలు ఉంటాయి.
3. ప్రతి కంపార్ట్‌మెంట్ ఒక ఆటోమేటిక్ డోర్ కలిగి ఉంటుంది.
4. ప్రతి బోగీలో సీసీటీవీలు ఉంటాయి.
5. చివరి రెండు బోగీలలో ​360 డిగ్రీలు తిరిగే సీట్లతో విలాసవంతమైన సీటింగ్ అరేంజ్​మెంట్స్ ఉంటాయి. ​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.