స్ట్రీట్ ఫుడ్ స్టాళ్లు, రెస్టారెంట్లు నాన్ వెజ్ వెరైటీలను (Vadodara non veg restaurant ) బయటకు కనిపించేలా విక్రయానికి ఉంచడంపై గుజరాత్లోని వడోదరా మున్సిపల్ కార్పొరేషన్ (Vadodara Municipal Corporation) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆహార పదార్థాలను(non veg food) సరిగ్గా కప్పి ఉంచాలని నోటిఫికేషన్ జారీ చేసింది. రోడ్డుపై వెళ్లే వారికి మాంసాహారం కనిపించకుండా జాగ్రత్త పడాలని పేర్కొంది.
![VADODARA NON VEG DISPLAY](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13621134_fedyee9vqaabenv-3.jpg)
![VADODARA NON VEG DISPLAY](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13621134_fedyee9vqaabenv-2.jpg)
"నాన్ వెజ్ ఆహారాన్ని అందరికీ కనిపించేలా ఉంచడంపై మాకు ఫిర్యాదులు వచ్చాయి. వీధి వ్యాపారులు నాన్ వెజ్ ఆహారాన్ని బహిరంగంగా వండుతున్నప్పుడు.. తమ కళ్లలో దురద వంటి సమస్య వస్తోందని కొంతమంది మహిళలు, చిన్నారులు ఫిర్యాదు చేశారు. ఆహారాన్ని సరిగ్గా కప్పి ఉంచాలని మేయర్ నోటిఫికేషన్ జారీ చేశారు."
-నందా జోషి, వడోదరా డిప్యూటీ మేయర్
ప్రస్తుతానికి నియమాలపై నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేశామని నందా జోషి తెలిపారు. వీటిని అమలు చేయడంపై సంబంధిత వర్గాలతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చదవండి: బస్సులో పాటలు పెడితే.. ఇక గెట్ అవుటే!