గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్ర కొల్హాపుర్ అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలోనే కొందరు ఆరోగ్య కార్యకర్తలు సాహసం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. నలుగురు ఆరోగ్య కార్యకర్తలు.. చిన్నారులకు వ్యాక్సిన్ ఇవ్వడానికి అడవుల్లో నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లారు. భారీ వర్షాలతో వరదలు వస్తున్నా.. వ్యాక్సినేషన్‌కు వెళ్లి వృత్తి పట్ల వారికున్న నిబద్ధతను చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అజర తాలుకాలోని అనేక గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. ధంగర్వాడ గ్రామానికి ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని దుస్థితి. దీంతో వీరికి కనీస వైద్య సదుపాయాలు అందడం లేదు. వీటికి తోడు భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల ఈ టీకా పంపిణీ మరింత కష్టంగా మారింది. కానీ ఆరోగ్య కార్యకర్తలు పీఆర్ నాయక్, డీఎస్ గౌలికర్, రేఖా పాండురంగ, లక్ష్మీ జాదవ్.. వృత్తి పట్ల నిబద్ధతతో అడవుల్లో నాలుగు కిలోమీటర్లు నడిచి చిన్నారులకు వ్యాక్సిన్ అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ప్రతి వర్షాకాలంలోను వైద్యాధికారులు, ప్రజలు ఇలానే ప్రయాణం చేస్తారని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి:
ఇంట్లోనే నెమళ్ల పెంపకం.. అటవీ అధికారులు తనిఖీలు.. నిందితుడు అరెస్ట్
చిన్నారిపై సవతి తల్లి కర్కశం.. అన్నం అడిగితే సీలింగ్‌కు వేలాడదీసి..