Uttarakhand Election 2022: రాజకీయ అస్థిరతకు వేదికగా పేరుగాంచిన దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 13 జిల్లాల్లోని 70నియోజకవర్గాలకు ఒకే దశలో సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. 82,38,187లక్షల మంది ఓటర్లు 632 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. వీరిలో 152 మంది స్వతంత్రులు.
కొవిడ్-19 కారణంగా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తొలిసారిగా మహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా 101 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దివ్యాంగుల కోసం 6 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్‌లో ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.
ఇవీ చూడండి: Uttarakhand Election 2022: ఓటరు మౌనం.. పార్టీల్లో ఉత్కంఠ!