ETV Bharat / bharat

551 రకాల వడలు ఒకే చోట.. మీరూ చూసేయండి!

భారత దేశ వంటకాల్లో వడకు ఉన్న ప్రత్యేకత​ వేరు. దేశంలో వివిధ ప్రదేశాల్లో వడని ఎన్నో రకాలుగా తయారు చేస్తారు. అయితే.. వీటన్నింటినీ ఒకే చోట ప్రదర్శించే ప్రయత్నం చేసింది ఉత్తరాఖండ్​కు చెందిన ఓ హోటల్​. అవి ఎన్ని రకాలో చూద్దామా..?

south indian dishes name
వివిధ రకాల వడాలు
author img

By

Published : Sep 8, 2021, 1:46 PM IST

551 వడలతో లిమ్కా బుక్​ ఆఫ్ రికార్డ్స్​కు ప్రత్యేక ప్రదర్శన

వడ.. భారతీయ సంస్కృతిలో ఓ ప్రత్యేక వంటకం. ఈ విశాల భారతదేశంలో ఒక్కో చోట ఒక్కో రకంగా వడ తయారు చేస్తారు. కానీ అందులో మనకు తెలిసినవి కొన్నే కదా! అయితే.. అన్నింటినీ మనకు పరిచయం చేసే ప్రయత్నం చేసింది ఉత్తరాఖండ్​కు చెందిన ఓ హోటల్. దాదాపు 551 వడలను తయారు చేసి లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​కు ప్రదర్శనగా పెట్టింది.

south indian dishes name
ప్రదర్శనలో నోరూరించే వడలు

ఆ ఉద్దేశంతోనే..

భారతదేశంలో తయారు చేసే వడలన్నింటినీ ఒకే చోట ఉంచాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు నిర్వాహకులు స్మృతి హరి తెలిపారు. భారతీయ వడల గురించి ప్రపంచానికి తెలియపరచాలని ఇలా చేసినట్లు వెల్లడించారు. దాదాపు రెండేళ్ల క్రితం నుంచే ఈ ప్రదర్శన చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

south indian dishes name
ఒకే చోట 551 రకాల వడలు

"దేశంలో చాలా రకాల వడలు ఉన్నాయి. అవి ఈ దేశ సంస్కృతిలో భాగం. కానీ వీటిని ప్రచారం చేయకపోవడం వల్ల మరుగున పడిపోతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఆకర్షిస్తాయి. లిమ్కా బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో ఈ కార్యక్రమానికి చోటు దక్కుతుందని భావిస్తున్నా."

-రాజీవ్​ బడోలా, షెఫ్

51 వడాలు అక్కడి నుంచే..

ఈ వడలను తయారు చేయడానికి దాదాపు 300 పదార్థాలు వాడినట్లు నిర్వహకులు తెలిపారు. అయితే.. కేవలం ఉత్తరాఖండ్​ నుంచే 51 వడలను తయారుచేసినట్లు పేర్కొన్నారు. ఇవి ఈ ప్రదర్శనకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని అన్నారు.

south indian dishes name
ఒకే చోట 551 రకాల వడలు

ఇదీ చదవండి:'అయోధ్య'ను తలపించేలా గణేశ్​ ఆలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.