Uttar Pradesh Road Accident : ఓ కారు చెట్టును ఢీకొట్టడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్డోయ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు. ఖమరియా గ్రామంలో బిల్హౌర్-కత్రా హైవేపై ప్రమాదం జరిగింది. కారులో నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు గ్యాస్ కట్టర్లు వినియోగించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
-
#WATCH | Hardoi, UP: Five people of the same family died when their vehicle lost control on the Bilhaur-Katra highway and hit a tree.
— ANI (@ANI) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Durgesh Kumar Singh (SP, Hardoi) says, "A total of four persons and a four-year-old child were going from Barakanth village to Nayagaon in a… pic.twitter.com/fBfUG0FkGV
">#WATCH | Hardoi, UP: Five people of the same family died when their vehicle lost control on the Bilhaur-Katra highway and hit a tree.
— ANI (@ANI) October 30, 2023
Durgesh Kumar Singh (SP, Hardoi) says, "A total of four persons and a four-year-old child were going from Barakanth village to Nayagaon in a… pic.twitter.com/fBfUG0FkGV#WATCH | Hardoi, UP: Five people of the same family died when their vehicle lost control on the Bilhaur-Katra highway and hit a tree.
— ANI (@ANI) October 30, 2023
Durgesh Kumar Singh (SP, Hardoi) says, "A total of four persons and a four-year-old child were going from Barakanth village to Nayagaon in a… pic.twitter.com/fBfUG0FkGV
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి సహా మొత్తం ఐదుగురు ఉన్నారు. బాధితులు బరాకాంత్ గ్రామానికి చెందిన వారు. వీరంతా బరాకాంత్ నుంచి నయాగావ్ వెళ్తున్నారు. మార్గ మధ్యలో కారు ప్రమాదానికి గురైంది.
ఘటనపై స్థానికుల నుంచి సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకుని.. బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.
బోల్తా పడ్డ పోలీసుల బస్సు.. 38 మంది..
పోలీసులు వెళ్తున్న బస్సు బోల్తా పడి 38 మంది గాయపడ్డారు. గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వాహనం బ్రేక్‌లు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణం. స్టేట్ రిజర్వ్ పోలీసులు.. ఫైరింగ్ ప్రాక్టీస్ ముగించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. వారందరి వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పోలీసుల పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
-
#WATCH | Panchmahal, Gujarat: 38 personnel of the State Reserve Police (SRP) were injured when a bus carrying them overturned due to brake failure.
— ANI (@ANI) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Police officer, ML Gohil said, "...The jawans were returning after completing their firing practice when the bus overturned due to… pic.twitter.com/7aCGWVJaun
">#WATCH | Panchmahal, Gujarat: 38 personnel of the State Reserve Police (SRP) were injured when a bus carrying them overturned due to brake failure.
— ANI (@ANI) October 30, 2023
Police officer, ML Gohil said, "...The jawans were returning after completing their firing practice when the bus overturned due to… pic.twitter.com/7aCGWVJaun#WATCH | Panchmahal, Gujarat: 38 personnel of the State Reserve Police (SRP) were injured when a bus carrying them overturned due to brake failure.
— ANI (@ANI) October 30, 2023
Police officer, ML Gohil said, "...The jawans were returning after completing their firing practice when the bus overturned due to… pic.twitter.com/7aCGWVJaun
ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి.. ఫంక్షన్ నుంచి వస్తుండగా..
Rajasthan Accident News : రెండు రోజుల క్రితం కూడా రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు.. ఓవర్టేక్ చేయబోయి లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఏడుగురు మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఘటనలో మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ఓ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. పూర్తి కథనం కోస ఇక్కడ క్లిక్ చేయండి.
Buses Fire At Bangalore : గ్యారేజీలో అగ్నిప్రమాదం.. 22 బస్సులు దగ్ధం.. కారణం అదే!