ETV Bharat / bharat

యూపీ బరిలో మజ్లిస్- ఏ పార్టీకి నష్టం? - ఉత్తర్​ప్రదేశ్​ 2022 అసెంబ్లీ ఎన్నికలు

ఉత్తర్​ప్రదేశ్​లో 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 100కుపైగా స్థానాల్లో పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటించింది. భాజపాను ఓడించేందుకు ఏ కూటమిలోనైనా చేరేందుకు సిద్ధమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్​ అలీ స్పష్టం చేశారు. ఈ ప్రకటన యూపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ముస్లిం ఓటర్లలో పట్టున్న సమాజ్​వాదీ పార్టీకి ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి?

aimim in up assembly election 2022, యూపీ ఎన్నికల్లో ఎంఐఎం
ఉత్తర్​ప్రదేశ్​లో మజ్లిస్​ పోటీ
author img

By

Published : Jun 15, 2021, 10:59 PM IST

ఇటీవల జరిగిన బిహార్​, గుజరాత్​, బంగాల్​ ఎన్నికల్లో పోటీ చేసి ప్రభావం చూపించిన ఎంఐఎం.. తాజాగా ఉత్తర్​ప్రదేశ్​లో బరిలో దిగేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని మైనార్టీ ఓట్లే లక్ష్యంగా వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్​ 100కుపైగా స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. 'ఈటీవీ భారత్'​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్​ అలీ వెల్లడించారు.

యూపీలో ప్రధాన పార్టీలైన భాజపా, సమాజ్​వాదీ పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచార సన్నాహాలు చేపడుతున్న నేపథ్యంలో మజ్లిస్​ చేసిన ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

131 స్థానాల్లో ప్రభావం!

'రాష్ట్రంలో 131స్థానాల్లో ముస్లిం ఓటర్లు కీలకంగా మారారు. ఈ పరిస్థితుల్లో భాజపాను అడ్డుకోవాలంటే అన్ని పార్టీలు కలిసి పోరాడాలి' అని షౌకత్​ అలీ అన్నారు. ఇందుకు కోసం ఏర్పడే ఏ కూటమిలోనైనా ఎంఐఎం భాగస్వామిగా ఉంటుందన్నారు. 'దుండగుల కూటమి'లో మాత్రం ఎంఐఎం చేరదని వ్యాఖ్యానించారు.

మజ్లిస్​ ప్రభావం చూపిస్తుందా?

మైనార్టీ ఓటర్లు అధికంగా ఉండే ఉత్తర్​ప్రదేశ్​లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కీలకంగా మారనుంది. కొన్ని పార్టీలకు సాంప్రదాయంగా వస్తున్న ముస్లిం ఓట్లను మజ్లిస్ చీల్చే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరిలో మజ్లిస్​ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్​ ఓవైసీ పుర్వాంచల్​లో పర్యటించినప్పుడు మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ముస్లిం ఓట్లపైనే ఆధారపడ్డ సమాజ్​వాదీ పార్టీ సందిగ్ధంలో పడింది.

ఆ పార్టీతో కలిస్తే?

ఎన్నికల నేపథ్యంలో చిన్న పార్టీలతో జతకట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్​ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఈ క్రమంలో అఖిలేశ్​ బాబాయ్ అయిన శివపాల్​ యాదవ్​కు చెందిన ప్రగతిశీల్​ సమాజ్​వాదీ పార్టీ.. ఎస్పీతో కలిసి పోటీ చేసేందుకు ఆసక్తిని కనబరుస్తోంది. అయితే శివపాల్​ యాదవ్​ ఒక సీటును ఆశిస్తున్నారు.

మరోవైపు ఎంఐఎం- ఓం ప్రకాశ్​ రాజ్​భర్​కు చెందిన సుహేల్​ దేవ్​ భారతీయ సమాజ్​ పార్టీ.. భగీదరి మోర్చా కూటమిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. శివపాల్​ యాదవ్​కు ఆశించిన ఒక్క సీటు కూడా అఖిలేశ్ ఇవ్వకపోతే.. ఆయన పార్టీ ఓవైసీ కూటమితో కలిసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదే జరిగితే అఖిలేశ్​ యాదవ్​కు తన సొంతింటి నుంచి వ్యతిరేకత వ్యక్తమై.. అది పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశమూ లేకపోలేదు.

రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి పోటీ చేయడమే మంచిదని శివపాల్ ఇటీవల 'ఈటీవీ భారత్'​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అలా అయితేనే భాజపాను ఓడించగలం అని అభిప్రాయపడ్డారు.

ఏం మారదు

మజ్లిస్​ ప్రకటనపై రాజకీయ విశ్లేషకులు విజయ్​ ఉపాధ్యాయ్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'బిహార్​ ఎన్నికల్లో ఎంఐఎం ఆశించినంత ప్రభావం చూపలేదు. బంగాల్​ ఎన్నికల్లో కూడా మజ్లిస్​కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రజలు ఓవైసీని ఎన్నుకునేందుకు సిద్ధంగా లేరు. యూపీలో కూడా మజ్లిస్​ అంతగా ప్రభావం చూపకపోవచ్చు' అని అన్నారు.

ఇదీ చదవండి : మిషన్ యూపీ: సరికొత్తగా భాజపా 'సోషల్​ ఇంజినీరింగ్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.