ETV Bharat / bharat

అన్నతో 'హలాలా'కు మాజీ భార్య నో.. ముఖంపై యాసిడ్​ పోసిన భర్త

అన్నయ్యతో హలాలా చేయమని మాజీ భార్యపై ఒత్తిడి తెచ్చాడు భర్త. అందుకు ఆమె నిరాకరించినందుకు ముఖంపై యాసిడ్ దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలపాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, త్రిపురలోని ఓ కాలేజీ విద్యార్థినిని కిడ్నాప్​ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు.

man-throws-acid-on-ex-wife-
man-throws-acid-on-ex-wife-
author img

By

Published : Jun 29, 2022, 5:01 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని బరేలీ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. అన్నయ్యతో హలాలాకు నిరాకరించిందని మాజీ భార్యపై యాసిడ్​ దాడి చేశాడు ఓ భర్త. ముఖంపై తీవ్రగాయాలతో విలవిలలాడిన ఆమెను కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్​ చేసి జైలుకు తరలించారు.

ఏం జరిగిందంటే.. బరేలీ జిల్లాకు చెందిన ఇషాక్..​ 11 ఏళ్ల క్రితం నస్రీన్​ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఇటీవలే అతడి చిన్న కుమార్తెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ విషయంలో భార్యభర్తలిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న అతడు తన భార్యకు ముమ్మారు​ తలాక్​ చెప్పాడు. వెంటనే బాధితురాలు తన కన్నవారింటికి వెళ్లిపోయింది. కానీ, భర్తపై ఎలాంటి కేసులు పెట్టలేదు. అదే అదనుగా భావించిన ఇషాక్​.. మళ్లీ నస్రీన్​ను భార్యగా స్వీకరిస్తానని సందేశాలు పంపాడు. కానీ, ఓ షరతు పెట్టాడు. మళ్లీ తనతో కలిసి జీవించాలంటే తన అన్నయ్యతో హలాలా చేసుకోవాలని తెలిపాడు. అందుకు బాధితురాలు అంగీకరించలేదు.

ఇటీవలే ఆమెను కలవడానికి వెళ్లిన ఇషాక్​.. తన అన్నయ్యతో హలాలా విషయంపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె పూర్తిగా నిరాకరించడం వల్ల.. వెంటనే ఆమె ముఖంపై యాసిడ్​ పోశాడు. తీవ్ర గాయాలపాలైన నస్రీన్​ను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. అతడ్ని అరెస్ట్​ చేసి జైలుకు తరలించారు. బాధితురాలికి మెరుగైన చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేశామని బరేలీ ఎస్​ఐ సత్యార్థ్​ అనురుద్ధ తెలిపారు.

హలాలా అంటే ఏంటి?.. విడాకులు తీసుకున్న ఓ ముస్లిం మహిళ మళ్లీ భర్తను పెళ్లి చేసుకోవాలంటే ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అతడికి విడాకులు ఇవ్వడమో లేదంటే అతడు మరణించే వరకు ఉండడమో చేయాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఆమె మళ్లీ తన భర్తను పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

కిడ్నాప్​ చేసి విద్యార్థినిపై అత్యాచారం.. త్రిపురలో ఓ 21 ఏళ్ల కాలేజీ విద్యార్థినిని కిడ్నాప్​ చేసి ఆపై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడ్ని పట్టుకునేందుకు గాలిస్తున్నామని చెప్పారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సెపాహిజాలా జిల్లాలోని మేలగర్​కు చెందిన బాధితురాలు పరీక్షకు హాజరై ఇంటికి తిరిగి వస్తోంది. అదే సమయంలో ముగ్గురు యువకులు కలిసి బాధితురాల్ని బలవంతంగా వాహనంలోకి ఎక్కించి హద్రా ప్రాంతంలో ఉన్న ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లాక యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు.

కళాశాల విద్యార్థిని కిడ్నాప్​ అయిందనే వార్త గ్రామమంతా వ్యాపించడం వల్ల.. పోలీసులు అలర్ట్​ అయ్యి స్థానిక ప్రజలతో సహాయంతో అత్యాచారం జరిగిన ఇంట్లోకి వెళ్లి యువతిని రక్షించారు. పోలీసుల రాకను పసిగట్టిన ప్రధాన నిందితుడు తప్పించుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. అతడిపై కిడ్నాప్​తో పాటు అత్యాచారం కేసు నమోదు చేశారు. ఆసుపత్రికి తరలించి యువతికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడ్ని అరెస్ట్​ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

పెళ్లి చేసుకుంటానంటూ అత్యాచారం.. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో 38 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగినిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అత్యాచారం చేసినందుకు రెవెన్యూ అధికారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. 2019లో ముంగేలి జిల్లాలో నాయబ్ తహసీల్దార్‌గా నియమితులైనప్పుడు బాధితురాలికి నిందితుడు సిర్మూర్‌తో పరిచయం ఏర్పడిందని పోలీస్​​స్టేషన్​ ఆఫీసర్​ మమతశర్మ చెప్పారు. నిందితుడు గత ఐదేళ్లుగా బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధిస్తున్నాడని, విచారణ జరుపుతున్నామని ఆమె తెలిపారు.

మలవిసర్జనకు వెళ్లిన బాలికపై హత్యాచారం!.. ఉత్తర్​ప్రదేశ్​లో విషాద ఘటన జరిగింది. మెడ చుట్టూ అత్యాచార గుర్తులతో ఉన్న ఓ 13 ఏళ్ల బాలిక మృతదేహాన్ని చెరకు తోటలో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. మంగళవారం ఉదయం.. మైనర్ మలవిసర్జనకు పొలానికి వెళ్లి తిరిగి రాలేదని, ఒక రోజు తర్వాత ఆమె మృతదేహాన్ని కొందరు గ్రామస్థులు గమనించారని చెప్పారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, అత్యాచారం చేసి హత్య చేసినట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొనట్లు ఐజీ లక్ష్మీ సింగ్ తెలిపారు.

ఇవీ చదవండి: మందు కొట్టి పాముతో 'ఆట'.. పురుషాంగంపై కాటుతో మృతి

కూతురి మృతదేహంతో 3 రోజులు ఇంట్లోనే.. బతికించడానికి పూజలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.