ETV Bharat / bharat

'హెల్మెట్​ పెట్టుకోలేదు.. రూ.1,000 ఫైన్​ కట్టు'.. కారు ఓనర్​కు పోలీసుల నోటీస్ - కారుకు రూ1000 జరిమానా విధించిన యూపీ పోలీసులు

హెల్మెట్​ పెట్టుకోలేదని ఓ కారు డ్రైవర్​కు జరిమానా విధించారు ట్రాఫిక్​ పోలీసులు. చలానా అందుకున్న అతడు చేసేదేమిలేక చివరకు రూ.1000 రవాణా శాఖకు చెల్లించాడు. ఈ వింత సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగు చూసింది.

UP Hamirpur police challans Rs.1000 car driver without helmet
కారుకు రూ1000 జరిమానా విధించిన యూపీ పోలీసులు
author img

By

Published : Apr 21, 2023, 7:56 PM IST

Updated : Apr 21, 2023, 8:36 PM IST

ఓ కారు డ్రైవర్​ హెల్మెట్​ పెట్టుకోలేదని రూ.1,000 జరిమానా విధించారు ట్రాఫిక్​ పోలీసులు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న.. ఈ వింత సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని హమీర్​పుర్​ జిల్లాలో వెలుగు చూసింది. వార్తాపత్రికలు సరఫరా చేసే ఓ కారు డ్రైవర్​కు చలానా పడింది. దీంతో చేసేదేమి లేక చివరకు జరిమానా మొత్తాన్ని ఆ రాష్ట్ర రవాణా శాఖకు చెల్లించాడు.

ముస్కరా పట్టణంలోని ఓ ప్రాంతానికి చెందిన పవన్ కుమార్ ఏప్రిల్ 18న తన కారులో వార్తాపత్రికలను సరఫరా చేసి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో ముస్కరా ట్రాఫిక్​ పోలీసులు పవన్​ వాహనాన్ని ఆపారు. అక్కడే తనిఖీల్లో ఉన్న స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్ నంద్ కిషోర్ యాదవ్.. పవన్​ కుమార్​ కారును ఫొటో తీసి రూ.1,000 చలానా విధించారు. ఎందుకు ఫైన్ వేశారు అని డ్రైవర్​ ప్రశ్నించగా.. హెల్మెట్​ పెట్టుకోనందుకు చలానా వేశామంటూ ట్రాఫిక్​ సిబ్బంది సమాధానం ఇచ్చారు. పైగా పవన్​ మొబైల్​కు చలానా​కి సంబంధించిన ఓ మెసేజ్​ కూడా వచ్చింది. కారు డ్రైవర్​ హెల్మెట్​ పెట్టుకోవడం ఏంటని.. పైగా వాహనం ఆపి మరి చలానా విధించడం ఏంటంటూ పవన్​ ట్రాఫిక్​ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు చలానా రశీదును రద్దు చేస్తామని హామీ ఇచ్చి పంపించేశారు. అయినా సదరు ఇన్​వాయిస్​ క్యాన్సిల్​ కాకపోవడం వల్ల తప్పక రూ.1,000ను చెల్లించాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై కొందరు ముస్కరా ట్రాఫిక్​ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ బ్రజ్‌మోహన్​ను వివరణ కోరగా.. ఇది పొరపాటున జరిగిందని.. చాలా సార్లు ఇలాంటి తప్పిదాలు జరిగాయని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. పవన్​ కుమార్​ చలానా​ రద్దు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

UP Hamirpur police challans Rs.1000 car driver without helmet
కారులో హెల్మెట్​ పెట్టుకోలేదని యూపీ పోలీసులు విధించిన రూ.1000 చలానా

సీటు బెల్ట్​ లేదని బైక్ ​డ్రైవర్​కు చలానా​..!
సరిగ్గా ఆరు నెలల క్రితం కూడా ఇలాంటి పొరపాటే కురారా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ స్టేషన్​ సిబ్బంది చేసిన తప్పిదంతో ఇద్దరు వ్యక్తులకు తప్పుడు చలాన్ల వేశారు అధికారులు. హెల్మెట్ ధరించనందుకు కారు డ్రైవర్‌కు రూ.1000 చలానాను జారీ చేశారు కురారా పోలీస్​ సిబ్బంది​. మరో ఘటనలో ద్విచక్రవాహనదారుడు సీటు బెల్టు పెట్టుకోనందుకు అతడికి కూడా వెయ్యి రూపాయల ఫైన్​ విధించారు.

అక్కడ రూ.1000.. ఇక్కడ రూ.500..!
గతేడాది డిసెంబర్​లో కూడా అచ్చం ఈ తరహా ఘటనే కర్ణాటకలో జరిగింది. హెల్మెట్​ పెట్టుకోలేదని ఓ కారు ఓనర్​కు రూ.500 ఫైన్​ను విధించారు మంగళూరు ట్రాఫిక్​ పోలీసులు. ఫైన్​ కట్టాలంటూ సదరు వ్యక్తి మొబైల్​కు మెసేజ్​ పంపింది రవాణా శాఖ. ఇదే విషయంపై ట్రాఫిక్​ ఉన్నతాధికారులను సంప్రదించాడు ఆ కారు ఓనర్​. మరి అతడు ఆ చలానాను కట్టాడా.. లేదా తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

Last Updated : Apr 21, 2023, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.