ETV Bharat / bharat

యూపీ తొలి దశ పోలింగ్​ షురూ.. 58 స్థానాల్లో పోరు - Voting for the first phase

UP Election Phase 1: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్​ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రజలు.. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్​ కేంద్రాల ముందు బారులుతీరారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంది.

up-election-2022
up-election-2022
author img

By

Published : Feb 10, 2022, 7:14 AM IST

Updated : Feb 10, 2022, 7:23 AM IST

UP Election Phase 1: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఉత్తర్​ప్రదేశ్​ తొలి విడత పోలింగ్​తో తెరలేచింది. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లోని 58 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. ఓటర్లు ఉదయమే పోలింగ్​ కేంద్రాలకు తరలివచ్చారు.

up-election-2022
పోలింగ్​ కేంద్రం వద్ద జనం
up-election-2022
ఓటు హక్కు వినియోగించుకొని వేలుకు సిరా గుర్తు చూపుతున్న స్థానిక ఓటరు

మొత్తం 623 అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.27 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు.

ముఖ్యంగా జాట్​ వర్గానికి చెందిన ఓటర్లు.. ప్రభావం చూపించనున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో ఈ సామాజిక వర్గమే ప్రధాన పాత్ర పోషించింది.

ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్​.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.

మోదీ ట్వీట్​..

ఎన్నికల ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు. ఓటర్లంతా ఉత్సాహంగా ఎన్నికల పండగలో భాగం కావాలని కోరారు.

2017 ఎన్నికల్లో పశ్చిమ యూపీలోని 58 స్థానాల్లో.. భాజపా 53 చోట్ల గెలుపొందింది.

రాష్ట్రంలో మొత్తం ఏడు దశల్లో పోలింగ్​ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇవీ చూడండి: 'బికినీ, జీన్స్​, హిజాబ్​.. అంతా మా ఇష్టం! మధ్యలో మీరెవరు?'

అటల్​ సొరంగానికి ప్రపంచ రికార్డ్​- వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు

Last Updated : Feb 10, 2022, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.