ETV Bharat / bharat

'ఆ శిశువుకు రెండు తలలు!'.. చూసేందుకు ఎగబడిన జనం!! - ఆక్సిపిటల్ ఎన్సెఫలోసెల్ వ్యాధి

రెండు తలలు ఉన్నట్లుగా కనిపించే శిశువుకు(Two Headed Baby) జన్మనిచ్చింది ఓ మహిళ. దీంతో ఆ శిశువును చూసేందుకు జనం భారీగా ఆస్పత్రికి చేరుకున్నారు. ఝార్ఖండ్​లో ఈ సంఘటన జరిగింది.

two head baby
రెండు తలల పాప
author img

By

Published : Nov 9, 2021, 10:06 AM IST

Updated : Nov 9, 2021, 5:06 PM IST

ఝార్ఖండ్​ జంషెద్​పుర్​లో(Jharkhand Jamshedpur News) అరుదైన సంఘటన జరిగింది. ఓ మహిళ.. రెండు తలలు ఉన్నట్లుగా(Two Headed Baby) కనిపిస్తున్న ఓ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆ శిశువును చూసేందుకు మహిళ ప్రసవించిన ఆస్పత్రికి జనం భారీగా చేరుకున్నారు.

జంషెద్​పుర్​లోని ఎంజీఎం ఆస్పత్రిలో రాణాదేవీ అనే మహిళ.. సోమవారం ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. శిశువుకు తల వెనుక మరో తల ఉన్నట్లుగా(Two Headed Baby) ఆకృతి ఉంది. దీంతో రెండు తలలు ఉన్నట్లుగా ఆ పాప కనిపించింది. స్థానికంగా ఈ వార్త తెగ వ్యాప్తి చెందగా.. శిశువును చూసేందుకు చాలా మంది ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్నారు.

ఆ వ్యాధి వల్లే..

అయితే.. ఆక్సిపిటల్ ఎన్సెఫలోసెల్(occipital encephalocele) అనే అరుదైన వ్యాధి కారణంగానే చిన్నారి ఇలా జన్మించిందని ఎంజీఎం డిప్యూటీ సూపరింటెండెంట్​ డాక్టర్ నకుల్​ చౌదరీ తెలిపారు. శిశువుకు నిజంగా రెండు తలలు లేవని చెప్పారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగానే ఉందని.. ఆమెను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించారు.

మరికొన్ని రోజుల పాటు చిన్నారిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచుతామని చెప్పారు నకుల్ చౌదరీ. ఆ తర్వాత శస్త్రచికిత్స చేసి, తలకు అంటి ఉన్న మిగతా భాగాన్ని తొలగిస్తామని చెప్పారు. రాంచీలోని రిమ్స్​ ఆస్పత్రిలో ఈ శస్త్రచికిత్స జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగానే ఉన్నారని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Nov 9, 2021, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.