ETV Bharat / bharat

యూపీలో కాంగ్రెస్​కు షాక్​- టీఎంసీలోకి కీలక నేతలు

ఉత్తర్​ప్రదేశ్​లో కాంగ్రెస్​కు(up congress news ) భారీ షాక్​ తగిలింది. పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు(up congress leaders) తృణమూల్​ కాంగ్రెస్​లో చేరారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో.. భాజపాను గద్దె దించేందుకు పోరాడతామని పేర్కొన్నారు.

leaders from Congress join Trinamool Congress
టీఎంసీలోకి కాంగ్రెస్​ నేతలు
author img

By

Published : Oct 25, 2021, 5:50 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్​కు(up congress news) పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన ఇద్దరు కీలకమైన సీనియర్​ నేతలు(up congress leaders) తృణమూల్​ కాంగ్రెస్​లో చేరారు. ఉత్తర బంగాల్​లోని సిలిగుడి పర్యటనలో ఉన్న బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో కాంగ్రెస్​ నేతలు రాజేశ్​పతి త్రిపాఠి, లలితేశ్​​పతి త్రిపాఠి.. టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ(mamata banerjee news) నేతృత్వంలో.. యూపీ సహా కేంద్రంలో భాజపాను గద్దె దించేందుకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

leaders from Congress join Trinamool Congress
టీఎంసీలోకి కాంగ్రెస్​ నేతలు

రాజేశ్​పతి త్రిపాఠి ఎమ్మెల్సీగా సేవలందించగా.. లలితేశ్​పతి త్రిపాఠి యూపీ కాంగ్రెస్​ ఉపాధ్యక్షుడిగా, ఓసారి ఎమ్మెల్యేగానూ చేశారు. వీరు ఇరువురు యూపీ మాజీ ముఖ్యమంత్రి కమలాపతి త్రిపాఠి మనవళ్లు.

కాంగ్రెస్​ నేతల చేరిక సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు మమతా బెనర్జీ(mamata banerjee news). 'టీఎంసీపై విశ్వాసం పెరుగుతోంది. ఇద్దరు కాంగ్రెస్​ నేతల చేరికతో భాజపాకు వ్యతిరేకంగా పోరాటం చేయగల అఖిల భారత పార్టీగా నిరూపితమవుతోంది.' అని పేర్కొన్నారు.

ఎస్పీలోకి ఇద్దరు బీఎస్పీ బహిష్కృత నేతలు

మరోవైపు.. సమాజ్​వాదీ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు బీఎస్పీ మాజీ నేతలు లాల్జీ వర్మ, రామాచల్​ రాజ్​భర్​. నవంబర్​ 7న అంబేడ్కర్​ నగర్​ జిల్లాలో జరిగే ఎస్పీ ర్యాలీ వేదికగా ఆ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ సమక్షంలో చేరతామని స్పష్టం చేశారు.

కొద్ది నెలల క్రితం జరిగిన పంచాయతీ​ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా వారిని జూన్​ 3న పార్టీ నుంచి బహిష్కరించారు మాయావతి. బీఎస్​పీ హయాంలో వారు మంత్రులుగా సేవలందించారు.

ఇదీ చూడండి: ఓటు కోసం 'దళిత' వ్యూహం- దేశంలో​ నయా రాజకీయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.