ETV Bharat / bharat

లఖింపుర్​ ఖేరి ఘటనలో ఇద్దరు నిందితుల అరెస్ట్​ - ఉత్తర్​ప్రదేశ్​ వార్తలు తాజా

లఖింపుర్​ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను యూపీ పోలీసులు (Lakhimpur Kheri News) అరెస్టు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి కుమారుడికి సమన్లు జారీ చేశారు.

lakhimpur kheri
లఖింపుర్​ ఖేరీ ఘటనలో ఇద్దరు నిందితుల అరెస్ట్​
author img

By

Published : Oct 7, 2021, 10:22 PM IST

లఖింపుర్​ కేసులో (Lakhimpur Kheri News) ఇద్దరు నిందితులను ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితులు బన్బీర్​పుర్​కు చెందిన లవ్​కుశ్​, నీఘాసన్​కు చెందిన ఆశిశ్​ పాండేలుగా గుర్తించారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్​ మిశ్రా కుమారుడికి కూడా సమన్లు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు తన ముందు హాజరు కావాలని పేర్కొన్నారు.

ఇదీ జరిగింది..

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ.. అక్టోబర్​ 3న లఖింపుర్‌ ఖేరిలో (Lakhimpur Kheri Incident) ఆందోళన చేస్తున్న రైతులపైకి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా కారు, మరో వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా, అనంతరం జరిగిన ఘర్షణలో మరో నలుగురు చనిపోవడం.. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. దీంతో ఆశిష్‌ మిశ్రా సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ప్రశ్నించేందుకు పిలిచారు.

ఇదీ చూడండి : నక్సలైట్లు, ఉగ్రవాదులతో పోరుకు 92 మంది మహిళలు సై!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.