Bihar thief two and half feet couple: బిహార్ బక్సర్ జిల్లాలో మరుగుజ్జు దంపతులు ఇంట్లో చొరబడిన ఓ దొంగకు చుక్కలు చూపించారు. చోరీకి వచ్చిన అతడిని చూసి ఎటువంటి భయం లేకుండా అడ్డుకున్నారు. అనంతరం దొంగను పోలీసులకు అప్పగించారు. కృష్ణబ్రహ్మ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పట్టుబడిన దొంగ ఎత్తు ఐదడుగుల కన్నా ఎక్కువేనని తెలుస్తోంది.
దంపతులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపించారు. దొంగ వద్ద ఎలాంటి వస్తువులు లభ్యం కాలేదని తెలిపారు. తనతో పాటు మరికొందరు చోరీకి వచ్చారని దొంగ వెల్లడించాడు. తనను పట్టుకోగానే వారంతా పరార్ అయ్యారని చెప్పారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దొంగలను చూసి బెదరకుండా ధైర్యం ప్రదర్శించిన మరుగుజ్జు దంపతులను స్థానికులు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి: