ETV Bharat / bharat

వివాదాస్పద మ్యాప్​ను తొలగించిన ట్విట్టర్​

author img

By

Published : Jun 29, 2021, 8:39 AM IST

Updated : Jun 29, 2021, 10:08 AM IST

భారత మ్యాప్​ను వక్రీకరించి చూపించిన ట్విట్టర్​.. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం కావడం వల్ల దానిని తొలగించింది. తన వెబ్​సైట్​లో భారత్​లో అంతర్భాగమైన జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లను ప్రత్యేక దేశంగా చూపించింది ట్విట్టర్​.

twitter controversial map on india
వివాదాస్పద మ్యాప్​ను తొలగించిన ట్విట్టర్​

భారత చిత్రపటాన్ని తప్పుగా చూపించి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న ట్విట్టర్​.. ఆ మ్యాప్​ను తొలగించింది. ట్వీప్​ లైఫ్​ సెక్షన్​లో ట్విట్టర్..​ సోమవారం సాయంత్రం జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లను ప్రత్యేక దేశంగా పేర్కొంటూ మ్యాప్​ను​ పోస్ట్​ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. ట్విట్టర్​ బ్యాన్​ పేరుతో నెటిజన్లు ఈ చర్యపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ మ్యాప్​ను సోమవారం రాత్రి తొలగించింది. ఈ చర్యలపై ట్విట్టర్​ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.

ట్విట్టర్​ వైఖరిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ మ్యాప్​ ట్విట్టర్​ అధికారిక వెబ్​సైట్లోనే ఉంటడం వల్ల దీనికి ఆ సంస్థే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

భారత్​ మ్యాప్​ను తప్పుగా చూపటం ట్విట్టర్​కు ఇది తొలిసారి కాదు. గతేడాది కూడా లేహ్​ ప్రాంతాన్ని చైనా మ్యాప్​లో చూపించి విమర్శలను మూటగట్టుకుంది. ఆ సమయంలో ట్విట్టర్​కు ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

ట్విట్టర్ ఎండీపై కేసు..

ట్విట్టర్​ వైఖరిపై చర్యలు చేపట్టాలంటూ ఉత్తర్​ప్రదేశ్​ బులంద్​షహర్​ జిల్లాలోని ఖుర్జానగర్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. భజరంగ్‌ దళ్‌ నేత ప్రవీణ్ భాటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ట్విట్టర్​ ఇండియా ఎండీ మనీశ్​ మహేశ్వరీ సహా న్యూస్​ పార్టనర్షిప్స్​ హెడ్​ అమ్రితా త్రిపాఠిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదీ చదవండి : ట్విట్టర్ వరుస వివాదాలు- పొరపాట్లా? కవ్వింపులా?

Last Updated : Jun 29, 2021, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.