ETV Bharat / bharat

Tulip Garden : శ్రీనగర్​ తులిప్​ గార్డెన్​ అరుదైన ఘనత.. వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు.. 15లక్షల పుష్పాలతో.. - వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డులు అధ్యక్షుడు

Tulip Garden World Book Of Records : శ్రీనగర్​లోని తులిప్​ గార్డెన్​.. వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించింది. 15 లక్షల తులిప్​ పుష్పాలతో ఆసియాలో అతిపెద్ద గార్డెన్​గా ఈ ఘనత సాధించింది.

Tulip Garden World Book Of Records
Tulip Garden World Book Of Records
author img

By

Published : Aug 20, 2023, 1:42 PM IST

Updated : Aug 20, 2023, 2:13 PM IST

Tulip Garden World Book Of Records : జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​లో ఉన్న ఇందిరాగాంధీ మెమోరియల్​ తులిప్​ గార్డెన్ అరుదైన ఘనత సాధించింది. జబర్వాన్​ పర్వత శ్రేణుల దిగువ భాగంలో ఉన్న ఈ తులిప్​ గార్డెన్​.. వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించుకుంది. 68 రకాల 1.5 మిలియన్ల తులిప్​ పువ్వులతో ఆసియాలో అతిపెద్ద గార్డెన్​గా ఈ రికార్డు సృష్టించింది.

Srinagar Tulip Garden Record : తులిప్ గార్డెన్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఫ్లోరికల్చర్, గార్డెన్స్​ అండ్ పార్క్స్ కమిషనర్ సెక్రటరీ షేక్ ఫయాజ్ అహ్మద్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధ్యక్షుడు సంతోష్ శుక్లా.. గుర్తింపు పత్రాన్ని అందించారు. ఈ గార్డెన్​ను ఆసియాలోనే అతిపెద్ద తులిప్​ స్వర్గంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ దిలీప్ ఎన్ పండిత్, కశ్మీర్ అధికారులు, గార్డెనింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Jammu and Kashmir: Srinagar's Tulip Garden enters 'World Book of Records' as Asia's largest
కమిషనర్ సెక్రటరీ షేక్ ఫయాజ్ అహ్మద్‌కు సర్టిఫికెట్​ అందిస్తున్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధ్యక్షుడు సంతోష్ శుక్లా

'ఇదొక చరిత్రాత్మక విజయం..'
ఇందిరాగాంధీ మెమోరియల్​ తులిప్​ గార్డెన్​ గొప్పతనాన్ని గుర్తించినందుకు.. వరల్డ్ ఆఫ్​ రికార్డ్స్ బృందానికి కమిషనర్​ సెక్రటరీ షేక్ ఫయాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక చరిత్రాత్మక విజయంగా వర్ణించారు. కశ్మీర్​లో పూల సంపద.. స్థానికంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని వివరించారు. వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించడం.. మానవులు, ప్రకృతి మధ్య ఉన్న బంధానికి ప్రతీక అంటూ అభివర్ణించారు.

'ఈ ఘనత.. గార్డెన్​ అందాన్ని..'
ఈ ఘనత సాధించినందుకు తులిప్​ గార్డెన్​ సెంట్రల్ వర్కింగ్ కమిటీకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రెసిడెంట్ సంతోశ్​ శుక్రా అభినందనలు తెలిపారు. ఈ గుర్తింపు.. ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ అసమానమైన అందాన్ని చాటి చెబుతుందని అన్నారు. ప్రకృతి వైభవానికి ఈ ఘనత ఒక చిహ్నంగా ఉంటుందని చెప్పారు.

Srinagar Tulip Garden : ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో తులిప్‌ పూల గార్డెన్‌లు ఉన్నాయి. అయితే శ్రీనగర్‌లోని తులిప్‌ గార్డెన్‌ మాత్రం ఆసియా ఖండంలోనే అతిపెద్దది. ఈ గార్డెన్‌ విస్తీర్ణం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 30 హెక్టార్‌లు విస్తరించి ఉంది. ఏటా వసంత రుతువులో పుష్పాలు వికసిస్తుంటే ఈ గార్డెన్‌ను తెరుస్తారు. తులిప్ ఫెస్టివల్‌ పేరుతో ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. ఆ సమయంలో లక్షలమంది పర్యటకులు తరలివస్తారు.

Last Updated : Aug 20, 2023, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.