ఉత్తర్‌ప్రదేశ్ బరేలీలో ఘోరం జరిగింది. దిబ్రూగఢ్ నుంచి దిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కుతుండగా.. ఓ జవాన్‌ను టీటీఈ కిందకు తోసేశాడు. ఈ క్రమంలో రైలు కింద పడిన సైనికుడి రెండు కాళ్లు తెగిపోయాయి. ప్రస్తుతం క్షతగాత్రుడు ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జవాను పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే స్టేషన్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. టీటీఈపై చర్యలు తీసుకోవాలని సైనికులు, ప్రయాణికులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బరేలీ రైల్వేస్టేషన్లో చాలా సేపు రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కదులుతున్న రైలును ఎక్కేందుకు ఓ జవాన్ ప్రయత్నించాడు. ఇంతలో రైలులో ఉన్న టీటీఈ.. రైలు ఎక్కుతున్న జవాన్‌ను కిందకు నెట్టేశాడు. రైలు కింద పడి.. జవాన్ రెండు కాళ్లు తెగిపోయాయి. పోలీసులు బరేలీ రైల్వే స్టేషన్‌కు చేరుకుని రైలును పంపించారు. పరారీలో ఉన్న నిందితుడిపై కేసు నమోదు చేసుకున్నారు. అతడి కోసం గాలిస్తున్నామని తెలిపారు.
ఇవీ చదవండి: 279 మందిని చంపి.. రూ.11కోట్లు సంపాదించిన క్లర్క్.. అంతా 'నకిలీ' మాయ!
అక్రమ నిర్మాణం కేసులో కోర్టు షాక్.. సొంతంగా భవనాన్ని కూల్చేస్తున్న కేంద్రమంత్రి