ETV Bharat / bharat

రెండు రోజులపాటు ట్రేడ్ యూనియన్ల సమ్మె

author img

By

Published : Nov 3, 2021, 6:36 PM IST

దేశవ్యాప్తంగా రెండు రోజులపాటు సమ్మెకు ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల సమయంలో సమ్మె ఉంటుందని ప్రకటించాయి.

Trade unions
ట్రేడ్ యూనియన్లు

దేశంలో పెరిగిన ఇంధన ధరలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మెకు ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. వచ్చే ఏడాది పార్లమెంట్​ బడ్జెట్ సమావేశాల సమయంలో రెండు రోజుల పాటు సమ్మె నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు నవంబరు 1న దిల్లీలో జరిగిన ట్రేడ్ యూనియన్ల సమావేశంలో సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి.

నవంబరు 11న దిల్లీలో జాతీయ స్థాయిలో కన్వెన్షన్​ను ఏర్పాటు చేసి.. ఆ తర్వాత క్రమంగా ప్రజలకు దగ్గరవ్వటం, రాష్ట్రస్థాయిలో సమావేశాల నిర్వహణ, మినీ పార్లమెంట్లు నిర్వహించటం.. తదితర కార్యక్రమాలతో ముందుకెళ్లాలని ట్రేడ్ యూనియన్లు నిర్ణయించాయి.

ఈ సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్​కేఎం) కూడా పాల్గొంది. కార్మికుడు- కర్షకుడి భాగస్వామ్యం ప్రస్తుతం పరిస్థితుల్లో ఎంతో అవసరమని ట్రేడ్​ యూనియన్ సభ్యులు అభిప్రాయపడ్డారు.

హాజరైన ట్రేడ్ యూనియన్లు..

నేషనల్​ ట్రేడర్​ యూనియన్ కాంగ్రెస్​ (ఐఎన్​టీయూసీ), ఆల్​ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్​ (ఏఐటీయూసీ), హింద్​ మజ్దూర్​ సభా (హెచ్​ఎంఎస్​), సెంటర్ ఆఫ్​ ఇండియన్ యూనియన్​ (సీఐటీయూ), ఆల్​ ఇండియా యూనైటెడ్​ ట్రేడ్​ యూనియన్​ సెంటర్​ (ఏఐయూటీయూసీ), ట్రేడ్​ యూనియన్​ కో-ఆర్డినేషన్​ సెంటర్ (టీయూసీసీ), సెల్ఫ్​​ ఎంప్లాయిడ్​ ఉమెన్స్​ అసోసియేషన్​ (సెవా), ఆల్​ ఇండియా కౌన్సిల్ ఆఫ్​ ట్రేడ్ యూనియన్స్​ (ఏఐసీసీటీయూ), లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ (ఎల్​పీఎఫ్​), యునైటెడ్​ ట్రేడ్​ యూనియన్​ కాంగ్రెస్​ (యూటీయూసీ) సమావేశంలో పాల్గొన్నాయి.

ఇదీ చూడండి: 'ఆధార్'​ రూల్స్ బ్రేక్ చేస్తే రూ.కోటి జరిమానా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.