ETV Bharat / bharat

బావిని శుభ్రం చేస్తూ ఐదుగురు మృతి.. ముగ్గురు అన్నదమ్ములే! - బావిని శుభ్రం చేస్తూ ఐదుగురు దుర్మరణం

मध्य प्रदेश के बालाघाट जिले में बड़ा हादसा हो गया. यहां के गांव में कुएं की सफाई करने उतरे छह लोगों में से पांच की मौत हो गई, जबकि एक की हालत गंभीर है. मृतकों में तीन सगे भाई शामिल हैं. एक साथ पांच युवकों की मौत से गांव में मातम पसर गया है. सीएम शिवराज ने भी शोक जताया है.

Three brothers among five dead after inhaling toxic gas

author img

By

Published : Jun 9, 2022, 7:37 AM IST

Updated : Jun 9, 2022, 8:06 AM IST

07:31 June 09

బావిని శుభ్రం చేస్తూ ఐదుగురు మృతి.. ముగ్గురు అన్నదమ్ములే!

Toxic Gas Well: బావిలోని విషవాయువుల కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం మధ్యప్రదేశ్​లోని బాలా​ఘాట్ జిల్లా కుదాన్​ గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. మృతుల్లో ముగ్గురు అన్నదమ్ములుగా గుర్తించారు అధికారులు. మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం: బావిని శుభ్రం చేసేందుకు మొదట ఇద్దరు వ్యక్తులు దిగారు. లోపల ఉన్న విషవాయువుల కారణంగా వారు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎంతసేపైనా ఆ ఇద్దరూ పైకి రాకపోవడం వల్ల ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆ బావి యజమాని సహా మరో ముగ్గురు లోపలికి వెళ్లారు. వీరిలో కూడా ముగ్గురు విషవాయువుల ధాటికి చనిపోయారు. పాలక్​ కుర్చాందీ అనే మరో వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న పాలక్​ను ఆసుపత్రికి తరలించారు.

మృతులు పునీత్​ కుర్చాందీ (32), పన్ను కుర్చాందీ (30) మన్ను కుర్చాందీ (27) తేజ్​లాల్​ మర్కమ్​ (32), తమేశ్వర్​ బిల్సారేలుగా (20) అధికారులుగా గుర్తించారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్​.. తక్షణ సాయంగా మృతుల కుటుంబాలకు రూ.20వేలను అందించనున్నట్లు ప్రకటించారు. గ్రామస్థులు ఎవరూ బావిలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.

ఇదీ చూడండి : దేశవ్యాప్తంగా 42,000 కిలోల మాదకద్రవ్యాలు ధ్వంసం

Last Updated : Jun 9, 2022, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.