ETV Bharat / bharat

ట్రైన్​ ఇంజిన్​నే ఎత్తుకెళ్లిన దొంగలు.. సొరంగం తవ్వి మరీ చోరీ! - బిహార్ ట్రైన్​ ఇంజన్​ దొంగతనం

బిహార్​లో ఓ అరుదైన దొంగతనం జరిగింది. మరమ్మతుల కోసం ఉంచిన రైల్ ఇంజిన్​లోని భాగాలను దొంగల ముఠా పక్కా ప్లాన్​తో చోరీచేసింది. దీని విలువ లక్షల్లో ఉంటుందన్న వార్తలు స్థానికంగా కలకలం రేపాయి. దీనిపై రైల్వే అధికారులు స్పందించారు.

Thieves steal train engine in Barauni
ట్రైన్​ ఇంజన్​కే కన్నం వేసిన దొంగలు
author img

By

Published : Nov 25, 2022, 7:49 PM IST

బిహార్​లో ఓ దొంగల ముఠా ఏకంగా ట్రైన్​ ఇంజిన్​కే చోరీ చేసింది. పక్కాప్లాన్​తో ఓ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ఈ చోరీకి పాల్పడింది. ఈ కేసు విషయంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముఠా నాయుకుడితో పాటు మరికొంత మంది దొంగల్ని పట్టుకున్నారు. వారిచ్చిన సమాచారంతో దాదాపు రూ. 30 లక్షల విలువైన ట్రైన్​ ఇంజిన్​ భాగాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై స్పందించిన రైల్వే అధికారులు మాత్రం.. ఇదంతా నిజం కాదని అంటున్నారు.

అసలు ఏం జరిగిందంటే..
బెగుసరాయ్​ జిల్లా బరౌనీ ప్రాంతంలోని గర్హరా రైల్వేయార్డ్​లో మరమ్మతులకోసం తీసుకువచ్చిన ఓ ట్రైన్ ​ఇంజిన్​ను.. దొంగలు మాయం చేశారు. దొంగలు ఈ ఇంజిన్​ను వారం రోజుల్లో కొన్ని ముక్కలుగా చేసి ఎత్తుకుపోతూ.. చివరకు ఇంజిన్​నే లేకుండా చేశారు. ఈ చోరీ కోసం ఆ దొంగల ముఠా ప్రత్యేక సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ మార్గంగుండా వారు బస్తాలతో ఇంజిన్​లోని రాగితీగలు, అల్యూమినియం ప్లేట్​లను దొంగలించి.. వివిధ జిల్లాలోని స్క్రాప్​ దుకాణాల్లో అమ్మేశారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, రైల్వే స్పెషల్ విజిలెన్స్ బృందం నవంబర్​ 18న గర్హరా పరిసర ప్రాంతాల్లోని కొన్ని స్క్రాప్​ గోడౌన్​లపై దాడులు చేశారు. ఈ దాడుల్లో ట్రైన్​ ఇంజిన్​కు సంబంధించిన కొన్ని భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ దాడుల్లో భాగంగా దొంగల ముఠా నాయకుడు చందన్​కుమార్​తో పాటుగా.. మరో ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు. వారిని విచారించగా.. ఆ సమాచారంతో ముజఫర్‌పుర్‌ జిల్లాలోని ఓ గోడౌన్​పై దాడి చేసి దాదాపు రూ.30 లక్షల విలువ చేసే 13 బస్తాల ఇంజిన్​ విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్​ యజమానికి ముందుగానే దాడుల సమాచారం తెలియడం వల్ల పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. అయితే ఈ ముఠాతో పాటు మరికొంత మంది ఈ దొంగతనాలకు పాల్పడతున్నట్లు పోలీసులు గుర్తించారు. తూర్పు మధ్య రైల్వే అధికారులు ఈ వార్తలపై స్పందించారు.

"రైల్ ఇంజిన్ చోరీ వంటి సంఘటన ఏదీ జరగలేదు.. ఇది ఫేక్ న్యూస్. బరౌని స్టేషన్ సమీపంలో ఒక స్పేర్ రైల్ ఇంజిన్ ఉంచాం. దొంగలు అందులోకి ప్రవేశించి కొన్ని కేబుళ్లను అపహరించారు. ఈ కేసులో పది రోజుల క్రితం.. కొందరు దొంగలను అరెస్ట్​ చేశాం. అక్కడ సొరంగం లేదు. సరిహద్దు దగ్గర కొంత మట్టిని తొలగించడం వల్ల.. గొయ్యి వంటి చిన్న మార్గం ఏర్పడింది. అసలు ఇంజిన్ దొంగతనం జరగలేదు. కేబుల్ దొంగిలించిన దొంగలందరినీ అరెస్టు చేశాం."
-- బీరేందర్ కుమార్, సీపీఆర్​ఓ, తూర్పు మధ్య రైల్వే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.