ETV Bharat / bharat

Kodi katthi: కోడి కత్తి కేసు విచారణ వాయిదా.. తదుపరి విచారణ ఎప్పుడంటే..? - కోడి కత్తి కేసు విచారణ తాజా వార్తలు

Kodi katthi
Kodi katthi
author img

By

Published : Apr 27, 2023, 12:00 PM IST

Updated : Apr 27, 2023, 12:59 PM IST

11:54 April 27

మే 11కు వాయిదా వేసిన విజయవాడ ఎన్ఐఏ కోర్టు

Kodi Katti Case today Updates: కోడి కత్తి కేసు విచారణకు సంబంధించి విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు నేడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విడుదల చేసిన ఉత్తర్వులలో కోడి కత్తి కేసు విచారణను మే 11వ తేదీకి వాయిదా వేసినట్లు పేర్కొంది. తదుపరి విచారణను మే 11వ తేదీన చేపడతామని తెలిపింది. కోడి కత్తి కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరపాలని సీఎం జగన్‌ ఇటీవలే కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. కోర్టు హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో సీఎం జగన్ మోహన్ రెడ్డి కోర్టును కోరారు. ఎన్ఐఏ కోర్టు సైతం ఆ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసింది. ఈ క్రమంలో ఇటీవలే పదోన్నతి పొందిన ఎన్‌ఐఏ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు.

కోర్టుకు హాజరుకాలేను..! కోడి కత్తి కేసు విచారణకు సంబంధించి గత విచారణలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు హాజరై, సాక్ష్యం నమోదుకు ముందుకు రావాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తాను ప్రస్తుతం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉందని.. పేదలకు అందించే సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశాలు ఉన్న కారణంగా కోర్టుకు హాజరుకాలేనని సీఎం జగన్ తెలిపారు. అంతేకాదు, కోర్టుకు ముఖ్యమంత్రి హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో భారీగా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతాయని.. అడ్వకేట్‌ కమిషనర్‌ను నియమించి తన సమక్షంలో సాక్ష్యం నమోదు చేయించాలని సీఎం జగన్ పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. అనంతరం ఈ కోడి కత్తి కేసుకు దర్యాప్తును మరింత లోతుగా విచారణ జరపాలంటూ మరో పిటిషన్‌ను కూడా సీఎం జగన్ దాఖలు చేశారు. దీంతో జగన్ మోహన్ రెడ్డి వేసిన పిటిషన్లపై తదుపరి విచారణలో విచారిస్తామంటూ కోర్టు విచారణను వాయిదా వేసింది.

కోడి కత్తి కేసు విచారణ మరోసారి వాయిదా.. నేడు విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో కోడి కత్తి కేసుపై విచారణ జరగాల్సి ఉండగా ఇటీవలే పదోన్నతి పొందిన ఎన్‌ఐఏ కోర్టు జడ్జి బదిలీ కావడంతో తదుపరి విచారణను మే 11వ తేదీన చేపడతామని తెలిపింది. కోర్టు హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి వేసిన పిటిషన్లపై మే 11వ తేదీన ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరగనుంది.

అసలు ఏం జరిగిదంటే.. 2018వ సంవత్సరం అక్టోబరు నెలలో ఆనాడూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌పై శ్రీనివాస్ అనే వ్యక్తి తన వద్దనున్న కోడి కత్తితో దాడి చేశాడు. ఆ ఘటనపై విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టు దర్యాప్తు చేస్తుంది. ఈ కేసు విచారణలో సీఎం జగన్ బాధితుడిగానే గాక ఒక సాక్షిగా ఉన్న ఆయన్ను కోర్టుకు హాజరుకావాలంటూ ఎన్‌ఐఏ కోర్టు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, అడ్వకేట్‌ కమిషనర్‌ ద్వారా సాక్ష్యం నమోదు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కోర్టును కోరారు.

ఇవీ చదవండి

Last Updated : Apr 27, 2023, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.