ETV Bharat / bharat

స్నాక్స్​లో మత్తుమందు కలిపిన నవవధువు.. భర్త, అత్తమామలు స్పృహ తప్పాక పరార్​!

పెళ్లై అత్తవారింటికి వెళ్లకముందే ఓ నవవధువు వారికి షాకిచ్చింది. రైలులో భర్త, అత్తమామలకు మత్తుమందు కలిపిన స్నాక్స్​ ఇచ్చి.. వారు స్పృహ తప్పి పడిపోయాక అక్కడ నుంచి పరారైంది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

bride ran away after drugging her husband
అత్తమామలకు మత్తుమందు ఇచ్చి పారిపోయిన వధువు
author img

By

Published : Feb 7, 2023, 7:31 PM IST

ఓ నవవధువు తన భర్త సహా అతడి కుటుంబానికి స్నాక్స్​లో మత్తుమందు కలిపి ఇచ్చింది. అనంతరం వారు స్పృహ కోల్పోగానే అక్కడ నుంచి పరారైంది. ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాలో జరిగిందీ ఘటన. తనకు ఇష్టం లేని పెళ్లి చేయడం వల్లే నవవధువు ఇలా చేసి ఉంటుందని రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇదీ జరిగింది..
రాజస్థాన్​కు చెందిన ఓ యువకుడు.. ఉత్తర్​ప్రదేశ్ యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం నవవధువును తీసుకుని వారణాసి నుంచి జైపుర్​ వెళ్తున్న మరుధర్​​ రైలులో స్వస్థలానికి బయలుదేరారు వరుడి కుటుంబ సభ్యులు. అప్పుడు నవవధువు తన భర్త, అత్తమామలకు మత్తుమందు కలిపిన స్నాక్స్​ను ఇచ్చింది. వారు అవి తిని మత్తులోకి జారుకున్నారు. అలాగే వారిని రైలు నుంచి కిందకు దించి, నగ్లా రాంఫాల్ స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్​ పక్కన వదిలేసింది. అనంతరం అక్కడి నుంచి పరారైంది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది బాధిత కుటుంబాన్ని ఆస్పత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.