కర్ణాటకలోని రామనగరలో మతసామరస్యాన్ని చాటుతున్నారు సయ్యద్ సదత్ ఉల్లా సకఫ్ అనే వ్యక్తి. చన్నపట్టణకు చెందిన ఆయన.. తన సొంత డబ్బుతో బసవేశ్వర ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఆలయ ఆవరణలోనే మసీదును నిర్మించారు. హిందూ- ముస్లింలు సోదర భావంతో మెలగాలని సయ్యద్ కోరుతున్నారు.
కాగా, చన్నపట్టణంలో ప్రజలు కలిసిమెలిసి పండగలు జరుపుకొంటున్నారు. హిందూ దేవాలయంలో జరిగే జాతరకు.. ముస్లింలు తరలిరావడం ీ గ్రామం ప్రత్యేకత. అదేవిధంగా ముస్లింలు నిర్వహించే గంధ మహోత్సవానికి హిందువులు వెళ్తారు. కాబట్టి, ఈ గ్రామాన్ని హిందూ-ముస్లిం ఆధ్యాత్మికత గ్రామంగా పిలుస్తారు. అంతే కాకుండా సయ్యద్.. గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినవారికి విరాళాలు ఇస్తారు. హిందువులు- ముస్లింలు చివరి వరకు అన్నదమ్ముల్లా ఉండాలన్నదే తన కోరికని సయ్యద్ చెబుతున్నారు.
ఇవీ చదవండి: నిక్కరు పోస్టుపై దుమారం.. కాంగ్రెస్‌పై భాజపా, ఆర్ఎస్ఎస్ ఎదురుదాడి
గోగ్రా- హాట్‌స్ప్రింగ్స్ నుంచి భారత్, చైనా బలగాలు వెనక్కి.. అక్కడ మాత్రం..