ETV Bharat / bharat

Harishrao on AP politicians: 'చేతనైతే ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు కోసం పోరాడండి' - Harish Rao criticized AP government

Harish Rao Comments on AP government: ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలకు చేతనైతే ప్రత్యేక హోదా కోసం పోరాడాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్దిపేటలో బీఆర్​ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన మంత్రి.. ఉన్నది అంటే కొందరు ఏపీ నాయకులు ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవా చేశారు. చేతనైతే విశాఖ ఉక్కు కోసం పోరాడాలన్నారు. పోలవరం ప్రాజెక్టును కాళేశ్వరం మాదిరిగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.

harish rao
harish rao
author img

By

Published : Apr 17, 2023, 3:47 PM IST

ప్రత్యేక హోదా కోసం ఏపీ నేతలు ఎందుకు మాట్లాడట్లేదు: హరీశ్‌రావు

Harish Rao Comments on AP government: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్న విషయం మాట్లాడితే కొందరు ఏపీ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించిన హరీశ్​ రావు.. విశాఖ ఉక్కు కోసం ఎందుకు పోరాడటం లేదని నిలదీశారు. సిద్దిపేట బీఆర్​ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన మంత్రి హరీశ్​ రావు.. గతంలో ఆయన మాట్లాడిన మాటలపై వివరణ ఇచ్చారు.

గతంలో తాను పోలవరం పనులు ఎందుకు పూర్తి కావట్లేదని ప్రశ్నించానని.. అడిగిన దానికి సమాధానం చెప్పలేకే తనపై ఏపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని హరీశ్​రావు మండిపడ్డారు. ప్రజల పక్షానే తాను మాట్లాడానని వివరించిన హరీశ్ రావు.. ఏపీ గురించి తాను తప్పుగా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.

చేతనైతే విశాఖ ఉక్కు పోరాటం చేయాలి: తెలంగాణ అభివృద్ధిలో ఉన్న ప్రతి ఒక్కరూ మా బిడ్డలే అన్నట్లు తెలిపారు. తెలంగాణలో అన్నీ బాగున్నాయి.. ఇక్కడే ఉండండి అన్నానని వివరించారు. ఏపీ నేతలకు చేతనైతే ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు కోసం పోరాడాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టును కాళేశ్వరం మాదిరిగా పూర్తి చేయాలని అన్నారు.

"కొందరు ఏపీ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు. ఉన్నది అంటే కొందరు ఉలిక్కి పడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ నేతలు ఎందుకు మాట్లాడట్లేదు. విశాఖ ఉక్కు కోసం ఎందుకు పోరాడటం లేదు. పోలవరం పనులు ఎందుకు పూర్తి కావట్లేదని అన్నాను. అడిగిన దానికి సమాధానం చెప్పలేకే విమర్శలు. ప్రజల పక్షానే నేను మాట్లాడాను. ఏపీ గురించి తప్పుగా మాట్లాడలేదు. తెలంగాణ అభివృద్ధిలో ఉన్న ప్రతి ఒక్కరూ మా బిడ్డలే అన్నాను. మేము ఏపీ గురించి ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు. తెలంగాణలో అన్నీ బాగున్నాయి.. ఇక్కడే ఉండండి అన్నాను. ఏపీ నేతలకు చేతనైతే ప్రత్యేక హోదా కోసం పోరాడాలి. ఏపీ నేతలకు చేతనైతే విశాఖ ఉక్కు కోసం పోరాడాలి. పోలవరం కూడా కాళేశ్వరం మాదిరిగా పూర్తి చేయాలి"- మంత్రి హరీశ్​రావు, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి

తెలంగాణ ప్రజలకు వైఎస్సాఆర్​సీపీ క్షమాపణ చెప్పాలి: మంత్రి హరీశ్​రావుపై వైఎస్సాఆర్​సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖండించారు. తెలంగాణ ప్రజలకు వైఎస్సాఆర్​సీపీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హరీశ్​రావు వ్యాఖ్యలపై వైఎస్సాఆర్​సీపీ నేతలు మితిమీరి స్పందిస్తున్నారని అభిప్రాయపడ్డారు. సమాధానం చెప్పకుండా తెలంగాణ ప్రజలను ఆ పార్టీ నేతలు తిట్టడం సరికాదని సూచించారు. పాలకుల వ్యాఖ్యలను ప్రజలకు ఆపాదించకూడదని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

Pawan Kalyan: 'తెలంగాణ ప్రజలకు వైఎస్సాఆర్​సీపీ క్షమాపణ చెప్పాలి'

కేంద్రమే ఏ విషయంలోనూ రాష్ట్రానికి సహకరించడం లేదు: హరీశ్​రావు

Telangana Elections 2023 : అసెంబ్లీ ఎన్నికలకు వేళాయే.. కసరత్తు షురూ చేసిన సీఈసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.