ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరి జిల్లాలో దారుణం జరిగింది. 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు దుండగులు. మహ్మదీ పరిధిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. బహిర్భూమికి వెళ్లిన బాలికను ఎత్తుకెళ్లిన దుండగులు.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఇంటికి చేరుకున్న ఆమె జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. బాలికను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
స్నేహం చేయకుంటే కిడ్నాప్ చేస్తాం: పాఠశాల విద్యార్థినుల్ని కొందరు ఆకతాయిలు వేధిస్తున్న ఘటన ఝార్ఖండ్ రాంచీలో జరిగింది. తమతో స్నేహం చేయాలని లేకపోతే కిడ్నాప్ చేస్తామని బెదిరించారు. ఈ విషయం బాలికల తల్లిదండ్రులకు తెలియడం వల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పాఠశాల ఆవరణలోకి వచ్చి వేధిస్తున్నా ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు. అన్సారీ, సొహైల్ అన్సారీ, జమీల్ అన్సారీగా గుర్తించారు.
మూడేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం: మధ్యప్రదేశ్ కట్నిలో దారుణం జరిగింది. నిద్రపోతున్న మూడేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కీచకుడు. ఈ దారుణ ఘటన కైమోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమేధ గ్రామంలో జరిగింది. చిన్నారి.. తల్లిదండ్రులతో నిద్రపోతుండగా ఇంట్లోకి వచ్చి ఎత్తుకెళ్లాడు. తల్లిదండ్రులు నిద్ర లేచేసరికి చిన్నారి లేకపోవడంతో వెతకగా.. ఇంటికి సమీపంలో దొరికింది. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా నిందితుడు తప్పించుకుని పారిపోయాడు. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని జబల్పుర్ వైద్య కళాశాలకు తరలించారు.
ఇవీ చదవండి: 21 ఏళ్లుగా గడ్డం పెంచిన వ్యక్తి.. ప్రభుత్వం ఆ పని చేయగానే క్లీన్ షేవ్
సొంత స్టేషన్లోనే సీన్ రివర్స్.. లాకప్‌లో పోలీసులు.. 2 గంటల తర్వాత..