ETV Bharat / bharat

రూ.15వేల కోసం బాలికను చంపిన యువకుడు.. ఆపై ఆత్మహత్య - పాల్​ఘర్​ న్యూస్​

Teenage Girl Murder: మహారాష్ట్రలో 17 ఏళ్ల బాలికను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. రూ.15 వేలు ఇవ్వకపోతే ఫొటోలు సోషల్​ మీడియాలో పెడతానని బెదిరించిన అతడు.. ఈ దారుణానికి పాల్పడ్డాడు. రాజస్థాన్​లో జరిగిన మరో ఘటనలో ఓ ప్రేమ జంట రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకుంది.

Teenage Girl Murder
love pair suicide news
author img

By

Published : Apr 15, 2022, 8:45 AM IST

Teenage Girl Murder: 17 ఏళ్ల బాలికను చంపిన ఓ యువకుడు ఆ తర్వాత తాను కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని పాల్​ఘడ్​లో ఈ ఘటన జరిగింది. నిందితుడిని అభిషేక్​ షాగా గుర్తించారు పోలీసులు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఓ మైనర్​తో​ కలిసి హాటల్​లో బసచేసిన నిందితుడు అభిషేక్​ షా.. కొంత సమయం గడిచాక భోజనానికి వెళ్తున్నానంటూ హోటల్​ సిబ్బందికి చెప్పి బయటకు వెళ్లాడు. ఎంతసేపు అయినా తిరిగిరాకపోవడం వల్ల సిబ్బందికి అనుమానం వచ్చి గదిలోకి వెళ్లి చూడగా బాలిక మంచంపై శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు కోసం గాలించగా.. బొరివలి సబర్బన్​ రైల్వే స్టేషన్​ వద్ద రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. తనకు రూ. 15వేల ఇవ్వకపోతే ఫొటోలను సోషల్​ మీడియాలో పెడతానని అభిషేక్​ బెదిరించాడని.. డబ్బులు ఇచ్చేందుకు బాలిక నిరాకరించడం వల్ల ఆమెను చంపేసి నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రేమ జంట ఆత్మహత్య: రాజస్థాన్​ సికర్​లో ప్రేమ జంట పట్టాలపై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సదర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని రషిద్​పుర ఖోరి గ్రామంలో జరిగింది. శవపరీక్షలు నిర్వహించిన అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: భార్యాభర్తల గొడవ.. 3 నెలల చిన్నారి గొంతు నులిమి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.