ETV Bharat / bharat

పదో తరగతి బాలుడితో ప్రేమాయణం.. ఉపాధ్యాయురాలు అరెస్ట్​ - పదో తరగతి బాలుడితో టీచర్​ ప్రేమాయణం

Teacher and student loves: పదో తరగతి విద్యార్థిని ప్రేమించిన ఓ ఉపాధ్యాయురాలిపై పోక్సో కేసు నమోదైంది. ప్రేమ పేరుతో బాలుడిని వేధించిన టీచర్​ను అరెస్ట్​ చేశారు పోలీసులు. ఈ సంఘటన తమిళనాడు, అరియలూర్​ జిల్లాలో జరిగింది.

POCSO case
పోక్సో కేసు
author img

By

Published : Dec 30, 2021, 9:44 AM IST

Teacher and student loves: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే అసభ్యంగా ప్రవర్తిస్తూ.. తమ వృత్తికే కలంకం తీసుకొస్తున్నారు. ప్రేమ పేరుతో విద్యార్థినిని వేధించిన ఉపాధ్యాయుడిపై కేసు నమోదు అనే వార్తాలు చాలానే విన్నాం. కానీ, ఇక్కడ దానికి వ్యతిరేకంగా జరిగింది. ఓ ఉపాధ్యాయురాలు.. తను పాఠాలు చెప్పే విద్యార్థిని ప్రేమించింది. ఈ సంఘటన తమిళనాడు అరియలూర్​ జిల్లాలో జరిగింది.

అరియలూర్​ పట్టణానికి చెందిన ఓ టీచర్​.. తాను పని చేసే పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థిపై మనసుపారేసుకుంది. ప్రేమ పేరుతో ఆ బాలుడి వెంటపడింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన అరియలూర్​ పోలీసులు.. దర్యాప్తు చేపట్టి టీచర్​దే తప్పుగా తేల్చారు. పోక్సో చట్టం కింద అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు.

ఇదీ చూడండి: తల్లిపై అత్యాచారయత్నం.. మామను గొడ్డలితో నరికి చంపిన బాలికలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.