ETV Bharat / bharat

TDP National General Secretary Nara Lokesh Interview: 'నా తండ్రి ఏ తప్పూ చేయలేదు.. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు మేమే గెలుస్తాం'

TDP National General Secretary Nara Lokesh Interview: చంద్రబాబు నాయుడి అరెస్టు కేవలం ఒక స్పీడ్‌ బ్రేకర్‌ లాంటిదని.. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ సీట్లను పూర్తిగా తామే గెలుచుకుంటామని..టీడీపీ యువనేత నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. జగన్ చేసిన అవినీతి గురించి అందరికీ తెలుసని.. వైఎస్సార్సీపీతో పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్న పార్టీలను స్వాగతిస్తున్నామన్నారు. తాజాగా దిల్లీలో ఓ ప్రముఖ జాతీయ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన లోకేశ్.. పలు కీలక విషయాలను వెల్లడించారు.

Nara_Lokesh_Interview
Nara_Lokesh_Interview
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 7:08 PM IST

Updated : Sep 17, 2023, 6:27 AM IST

'నా తండ్రి ఏ తప్పూ చేయలేదు..ఎచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు మేమే గెలుస్తాం'

TDP National General Secretary Nara Lokesh Interview: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రనాయుడి అక్రమ అరెస్ట్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుపై వస్తున్న అవినీతి ఆరోపణలపై.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన విషయాలను వెల్లడించారు. దిల్లీలో ఓ ప్రముఖ జాతీయ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన లోకేశ్.. వైఎస్సార్సీపీతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్న ఏ పార్టీనైనా స్వాగతిస్తామన్నారు. జగన్‌తో పోరాటం చేస్తున్న టీడీపీ, జనసేనతో కలిసి పోరాటం చేసేందుకు మిగతా పార్టీలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Nara Lokesh Comments: నారా లోకేశ్ మాట్లాడుతూ..''చంద్రబాబు నాయుడి అరెస్టు కేవలం ఒక స్పీడ్‌ బ్రేకర్‌ లాంటిది మాత్రమే. వైఎస్ జగన్ చేసిన అవినీతి గురించి అందరికీ తెలుసు. వైఎస్సార్సీపీతో పోరాటం చేసే పార్టీలు.. టీడీపీ, జనసేనతో కలిసి రావాలి. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ సీట్లను పూర్తిగా మేమే గెలుచుకుంటాం. నా తండ్రి చంద్రబాబు నాయుడు నిజాయతీ పరుడు. అవినీతి మరకలేని నాయకుడు. అలాంటి నిజాయతీపరుడిని ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపారు. అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తులే.. నిజాయతీపరులను వేధిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోంది. ఏపీ సీఐడీ రిమాండ్‌ రిపోర్టులు చదివితే చంద్రబాబుపై మోపినవి తప్పుడు ఆరోపణలని స్పష్టంగా అర్ధమవుతుంది. చంద్రబాబుకు డబ్బు అందినట్లు అందులో ఎక్కడా ఆధారాలు చూపలేదు. ఎందుకంటే ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. ఇది రాజకీయ కక్షసాధింపు చర్యే.'' అని ఆయన అన్నారు.

TDP Parliamentary Meeting Under Nara Lokesh లోకేశ్ అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ నేతల భేటీ.. ఉభయసభల్లో ఎజెండగా చంద్రబాబు అరెస్టు

Lokesh on Jagan CID Cases: అనంతరం రాష్ట్రంలోని అధికార పార్టీకి (వైఎస్ఆర్ కాంగ్రెస్) వ్యతిరేకంగా జరిగే పోరాటంలో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఏ పార్టీనైనా స్వాగతిస్తామని.. నారా లోకేశ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్‌ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు (సీబీఐ, ఈడీ) దాఖలు చేసిన క్రిమినల్ కేసుల విచారణ నత్తనడకన సాగుతున్నాయని మండిపడ్డారు. జగన్.. 42,000 కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడినట్టు సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసినప్పటికీ.. ఇప్పుడు అతను (జగన్) బెయిల్‌పై తన 10 సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారని లోకేశ్ తెలిపారు. అవినీతిపరులకు సంపూర్ణంగా అధికారం ఇస్తే నిజాయితీపరులపై దాడులు చేస్తారన్న లోకేశ్.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఇదే జరుగుతోందన్నారు. 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు.. గత 42 ఏళ్లలో చురుకైన రాజకీయ జీవితాన్ని నిర్మించారన్నారని లోకేశ్ వివరించారు.

Lokesh on TDP-JanaSena Alliance: బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌ను ఖండిచడమే కాకుండా, రాజమహేంద్రవరం జైలుకి విచ్చేసి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారని లోకేశ్ వ్యాఖ్యానించారు. అదే రోజున టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లభిస్తున్న ప్రజాదరణ, యువగళం పాదయాత్రకు వస్తున్న జనాన్ని చూసి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భయపడ్డాడని నారా లోకేశ్ ఆరోపించారు. పవన్ కల్యాణ్​కి కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది కాబట్టే తమ ప్రచారాలకు స్పీడ్ బ్రేకర్ వేయాలని ముఖ్యమంత్రి జగన్ కోరుకున్నారన్నారు.

Lokesh on Central Govt Intervention on Chandrababu Arrest: ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం ప్రభుత్వం ఏమైనా జోక్యం చేసుకుందా..? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు లోకేశ్ స్పందిస్తూ.. “రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకులపై కూడా కేసులు ఉన్నాయి. ఈ విషయంలో బీజేపీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వారికే వదిలేస్తున్నాను. వారు మా సమస్యపై స్పందిస్తారని నమ్మకం ఉంది.'' అని లోకేశ్ సమాధానం ఇచ్చారు. అవినీతి నిరోధక చట్ట నిబంధనలను ఉల్లంఘించి మరీ చంద్రబాబును అరెస్టు చేశారని లోకేశ్ మండిపడ్డారు.

MP RaghuramakrishnamRaju Hot Comments on YSRCP Govt: చంద్రబాబు అక్రమ అరెస్ట్ కేంద్రానికి తెలిసింది.. ఆందోళన చెందొద్దు: ఎంపీ రఘురామకృష్ణరాజు

Lokesh on Premchandra Reddy, Ajeya Kallam: ఆర్టికల్ 17(ఏ‌) నిబంధన ప్రకారం.. అరెస్టుకు ముందస్తు అనుమతి తప్పనిసరి ఇవ్వాలని నిబంధన ఉన్నప్పటికీ.. 17(ఏ‌) నిబంధన పాటించనందున.. చంద్రబాబు అరెస్టు చెల్లదన్నారు. స్కిల్‌ కేసు దర్యాప్తులో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని లోకేశ్ ఆగ్రహించారు. సీమెన్స్‌.. 6 రాష్ట్రాల్లో ఇదే తరహా ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులకు డబ్బు చేరినట్లు ఆధారాలు లేవని లోకేశ్ పేర్కొన్నారు. ఒప్పందం చేసింది.. నిధులు విడుదల చేసింది.. ప్రేమచంద్రారెడ్డి, అజేయ కల్లం అని.. ఎఫ్‌ఐఆర్‌లో ప్రేమచంద్రారెడ్డి, అజేయ కల్లం పేర్లు ఎందుకు లేవని లోకేశ్ ప్రశ్నించారు.

జగన్ పాలనలో మా పార్టీకి చెందిన వేలమంది నేతలు జైళ్లలో ఉన్నారు. నాపై కూడా హత్యాయత్నం సహా 22 తప్పుడు కేసులు పెట్టారు. పీపీఏలు రద్దు చేశారు.. పరిశ్రమలను ఏపీ నుంచి తరివేశారు. మాకు వస్తున్న ప్రజాస్పందన చూసే ప్రతీకార రాజకీయాలు మొదలుపెట్టారు. తప్పుడు కేసులతో నా తండ్రిని అరెస్టు చేయడం నన్ను కలచివేసింది. సమర్థంగా, వేగంగా పనిచేయడం తప్పని సీఐడీ అనడం సరికాదు. పవన్‌ కల్యాణ్‌ కూడా జగన్‌ ప్రభుత్వ బాధితుడే. ఏ తప్పూ చేయకున్నా చంద్రబాబును జైలుకు పంపారు. దేశప్రజలు అందరికీ వాస్తవాలు తెలియజెప్పేందుకే నేను దిల్లీ వచ్చా. చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని అందరినీ అభ్యర్థిస్తున్నా- నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

Jai Bhim Party President Shravan on Jagan Companies: షేర్ల రూపంలో జగన్ కంపెనీలకు రూ.వేల‌ కోట్లు బదలాయించారు: జడ శ్రావణ్ కుమార్

Last Updated : Sep 17, 2023, 6:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.