ETV Bharat / bharat

సుజయ్​ 'ట్రయాంగిల్​ లవ్​స్టోరీ'.. ఆమెను చంపి భర్తతో 8నెలల గర్భిణీ పరార్​.. చివరకు.. - ప్రియురాలి దారుణం హత్య

భర్త కోసం ఇంటికి వచ్చిన అతడి ప్రియురాలిని దారుణంగా హత్య చేసింది ఓ యువతి. కత్తితో తొమ్మిది చోట్ల పొడిచి చంపేసింది. ఆ తర్వాత తన భర్తను తీసుకుని ఇంటి నుంచి పరారైంది. చివరకు పోలీసుల స్పెషల్​ ఆపరేషన్​లో దొరికిపోయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

College student brutally murdered - husband arrested with pregnant wife!

author img

By

Published : May 5, 2023, 10:55 AM IST

ఇంటికి వచ్చిన తన భర్త ప్రియురాలిని కత్తితో తొమ్మిది చోట్ల పొడిచి చంపేసింది ఓ యువతి. వెంటనే తన భర్తను తీసుకుని పరారైంది. కానీ పోలీసుల స్పెషల్​ ఆపరేషన్​లో దొరికిపోయింది. తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో జరిగిన ఈ 'ట్రయాంగిల్​ లవ్​ స్టోరీ' క్రైమ్​లో ఓ ట్విస్ట్ కూడా ఉంది. అదేంటంటే?

పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని ఇడయార్‌పాళయానికి చెందిన సుజయ్​.. కొంతకాలం క్రితం రేష్మ అనే యువతిని ప్రేమించాడు. ఇద్దరూ ప్రేమలో మునిగితేలారు. కానీ వారిద్దరి పెళ్లికి తల్లిదండ్రులు అభ్యంతరం తెలపడం వల్ల విడిపోయారు. ఆ తర్వాత సుజయ్​.. స్థానికంగా ఓ కళాశాలలో చదువుతున్న సుబ్బులక్ష్మితో ప్రేమలో పడ్డాడు.

కానీ ఇక్కడే ఓ ట్విస్ట్​ ఉంది. సుబ్బులక్ష్మితో ప్రేమలో ఉన్న సుజయ్​కు అతడి కుటుంబసభ్యులు రేష్మతో వివాహం ఖరారు చేశారు. పెద్దల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఆ తర్వాత పొల్లాచ్చి ప్రాంతానికి వచ్చి రేష్మతో కొత్త కాపురం ప్రారంభించాడు సుజయ్. ఇటీవలే రేష్మ గర్భం కూడా దాల్చింది. కానీ తరచూ సుబ్బలక్ష్మితో సుజయ్​ ఫోన్​లో మాట్లాతుండేవాడు. ఈ క్రమంలోనే సుబ్బులక్ష్మి.. మే 2వ తేదీన సుజయ్​ ఇంటికి వచ్చింది. సుజయ్​, రేష్మ పెళ్లి చేసుకున్నారని తెలిసి ఆమె ఒక్కసారిగా షాక్​కు గురైంది. ఆ తర్వాత సుబ్బులక్ష్మి, రేష్మ మధ్య వాగ్వాదం జరిగింది.

దీంతో ఆగ్రహానికి గురైన రేష్మ.. దగ్గర్లోని కత్తి తీసుకుని సుబ్బులక్ష్మిని తొమ్మిది చోట్ల పొడిచింది. సుబ్బులక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే అక్కడి నుంచి సుజయ్​, రేష్మ పరారయ్యారు. ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సుజయ్​ ఇంటికి చేరుకున్నారు. సుబ్బులక్ష్మి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం పరీక్షల కోసం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న సుజయ్, ఎనిమిది నెలల గర్భిణీ అయిన రేష్మను కేరళ పోలీసులు అరెస్టు చేశారు.

స్కూల్​ విద్యార్థినిపై వేధింపులు.. కానిస్టేబుల్​ అరెస్ట్​
ప్రజలను కాపాడాల్సిన ఓ పోలీస్​.. పాఠశాల విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో జరిగింది. పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఆమెపై వేధింపులకు గురిచేశాడు కానిస్టేబుల్​. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్​ చేసి జైలుకు తరలించారు.

పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం.. కాంట్ ప్రాంతానికి చెందిన బాధిత విద్యార్థిని.. సైకిల్​పై​ తన స్కూల్​ నుంచి ఇంటికి వెళ్తోంది. అదే సమయంలో అటువైపుగా బైక్​పై వెళ్తున్న కానిస్టేబుల్​ సాదత్​ అలీ.. విద్యార్థిని పక్కకు వెళ్లాడు. అనంతరం వేధింపులకు గురిచేశాడు. ఫోన్‌ నంబర్‌ ఇవ్వాలంటూ వేధించాడు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. నిఘా పెట్టిన తల్లిదండ్రులు కానిస్టేబుల్‌ బాలికను వెంబడిస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని.. ఘటనను వీడియో తీశారు. బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు.. కానిస్టేబుల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. సాదత్‌ అలీపై సస్పెన్షన్‌ వేటు వేశారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.