ETV Bharat / bharat

పెళ్లి కోసం పాట్లు.. భార్య కావాలంటూ ఊరంతా పోస్టర్లు.. - wall posters for bride in tamil nadu

wall posters for bride: చిన్నపిల్లలు తప్పిపోయారనో... లేదా మతిస్థిమితం లేనివారు కనిపించకుండా పోయారనో మనం తరచుగా గోడలపై పోస్టర్లలో చూస్తుంటాం.. కానీ మదురైలోని విల్లుపురంలో 'నాకు మంచి భార్య కావాలి' అనే పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఎవరు వీటిని అతికించారు. అసలేంటీ కథ?

wall posters for bride
wall posters for bride
author img

By

Published : Jun 26, 2022, 10:24 PM IST

Tamil Nadu bride wall posters: తమిళనాడులో ఓ వ్యక్తి వధువు కావాలంటూ పోస్టర్లు అంటించాడు. మదురైలోని విల్లుపురంలో నివసించే 27ఏళ్ల జగన్.. పట్టణమంతా ఈ పోస్టర్లు అతికించాడు. మంచి భాగస్వామి కోసం తాను వెతుకుతున్నట్లు అందులో పేర్కొన్నాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. తాను ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్​గా పనిచేస్తున్నట్లు జగన్ పేర్కొన్నాడు. సంప్రదాయ పద్ధతుల్లో భాగస్వామిని వెతికేందుకు ప్రయత్నించిన అతడు.. అవి పనిచేయకపోయే సరికి ఈ మార్గం ఎంచుకున్నాడు.

Tamilnadu man puts up posters looking for bride
గోడకు అంటించిన పోస్టర్

అన్ని వివరాలతో పోస్టర్..
గోడలకు అంటించిన పోస్టర్​లలో తన పేరు, కులం, వేతనం, వృత్తి, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ వివరాలన్నీ స్పష్టంగా ఉండేలా చూసుకున్నాడు. చిన్న స్థలం కూడా తన పేరు మీద ఉందని అందులో చెప్పుకొచ్చాడు. డెనిమ్ షర్ట్ వేసుకున్న ఫొటోను సైతం పోస్టర్​పై ముద్రించాడు.

వాల్ పోస్టర్

మేనేజరే కాకుండా.. పార్ట్​టైమ్ డిజైనర్​గా పనిచేస్తున్నట్లు జగన్ చెప్పాడు. డిజైనర్​గా పనిచేస్తున్నప్పుడే ఇలాంటి వినూత్న ఆలోచన తనకు తట్టిందని తెలిపాడు. "గత ఐదేళ్లుగా నేను భాగస్వామి కోసం వెతుకుతున్నాను. కానీ, నా ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. ఇప్పటివరకు వివిధ అడ్వర్టైజ్​మెంట్​ల కోసం చాలా పోస్టర్లు డిజైన్ చేశాను. ఈ క్రమంలోనే 'నాకు నేను ఎందుకు ఓ పోస్టర్ డిజైన్ చేసుకోకూడదు?' అన్న ఆలోచన వచ్చింది. ఏదేమైనా.. 90లలో పుట్టినవారికి ఇప్పుడు చాలా కష్టమైన కాలం నడుస్తోంది" అంటూ తన గోడు చెప్పుకున్నాడు జగన్.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.