ETV Bharat / bharat

14 గంటల్లో 35 కి.మీ దూరం ఈత..14 ఏళ్ల బాలుడి అరుదైన రికార్డు - తమిళనాడు బాలుడి రికార్డు

తమిళనాడు థేనీ జిల్లాకు చెందిన బాలుడు స్విమ్మింగ్​లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 14 ఏళ్ల వయసులోనే పొడవైన కాలువను ఈది అరుదైన ఘనతను సాధించాడు.

tamilandu boy swimming record
స్నేహన్​ రికార్డు
author img

By

Published : Sep 25, 2022, 4:02 PM IST

14 ఏళ్ల బాలుడి అరుదైన రికార్డు

సరదాగా ఈత కొట్టడం వేరు.. ఈత కొట్టి రికార్డు కొట్టడం వేరు. ఇలా రికార్డును సృష్టించేవారు కొందరే ఉంటారు. రెండో కోవకు చెందుతాడు ఈ బాలుడు. 14 ఏళ్ల వయసులోనే పొడవైన కాలువను ఈది సరికొత్త రికార్డును నెలకొల్పాడు. తమిళనాడు థేనీ జిల్లాకు చెందిన బాలుడు 14 ఏళ్ల స్నేహన్ ఈ అరుదైన ఘనత సాధించాడు. అతి పొడవైన నార్త్ ఛానల్​ కెనాల్​ను అతి తక్కువ సమయంలోనే దాటి సరికొత్త రికార్డును సృష్టించాడు.

ఐర్లాండ్​, స్కాట్లాండ్​ దేశాల మధ్య ఉన్న నార్త్​ ఛానల్ కెనాల్​ను అతి తక్కువ సమయంలో ఈదాడు స్నేహన్. 35 కిలోమీటర్ల పొడవైన ఈ దూరాన్ని 14 గంటల 39 నిమిషాల్లోనే చేరుకున్నాడు​. అండర్​-14 కేటగిరీలో ఇప్పటి వరకు ఈ ఘనతను సాధించిన నాలుగో వ్యక్తిగా స్నేహన్ రికార్డు సృష్టించాడు​. ఈ ఘనతను సాధించడానికి చాలా కష్టపడ్డాడు స్నేహన్​. అనేక వారాల పాటు ఇంగ్లాండ్​లోని డొనఘడీ హర్బర్​లో కోచ్​ విజయ్​ కుమార్ సారథ్యంలో శిక్షణ పొందాడు. అంతకుముందు బాఘ్​ స్ట్రెయిట్​ను దాటి రికార్డు సృష్టించాడు స్నేహన్​.

ఇవీ చదవండి: షహీద్​ భగత్ సింగ్​ విమానాశ్రయంగా చండీగఢ్ ఎయిర్​పోర్ట్​: మోదీ

భర్త పిలుస్తున్నాడని చెప్పి తీసుకెళ్లి.. మహిళపై సామూహిక అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.