ETV Bharat / bharat

3 నెలల మనవడిని హత్య చేసిన అమ్మమ్మ.. ఆపై! - మనవడిని చంపిన బామ్మ

మనవడు, మనవరాళ్లను అమ్మమ్మలు ఎంతో ప్రేమతో చూసుకుంటారు. వారికి ఏమాత్రం బాధ కలిగినా అల్లాడిపోతారు. అయితే.. ఓ వృద్ధురాలు మాత్రం తన మూడు నెలల మనవడిని అతి కిరాతకంగా హత్య(Baby Killed By Grandmother) చేసింది. మనవరాలిపై హత్యాయత్నం చేసింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

baby killed by grand mother
మనవడిని హత్య చేసిన అమ్మమ్మ
author img

By

Published : Oct 22, 2021, 6:08 PM IST

తమిళనాడు కోయంబత్తూర్​లో(Tamil Nadu Coimbatore News) దారుణం జరిగింది. మతిస్థిమితం లేని ఓ వృద్ధురాలు.. తన మూడు నెలల వయసున్న మనవడిని హత్య(Baby Killed By Grandmother) చేసింది. అంతేగాక మరో మనవరాలిని హత్య చేసేందుకు యత్నించింది.

అసలేం జరిగింది?

కోయంబత్తూర్(Tamil Nadu Coimbatore News)​ జిల్లాలోని కౌండమపాల్యంకు చెందిన ఐశ్వర్య, భాస్కరన్.. భార్యాభర్తలు. ఐశ్వర్య మూణ్నెళ్ల క్రితం కవలలకు జన్మనిచ్చింది. వారిని చూసుకునేందుకు మదురై నుంచి ఐశ్వర్య తల్లి శాంతి.. భాస్కరన్ ఇంటికి వచ్చింది. రెండు నెలలుగా అక్కడే ఉంటూ ఆ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటోంది. అయితే.. మంగళవారం ఐశ్వర్య తన పిల్లలను ఇంట్లోనే ఉంచి, కిరాణ దుకాణానికి వెళ్లింది.

తిరిగి ఇంటికి వచ్చాక.. తన కుమారుడు విగత జీవిగా పడి ఉండడం చూసిన ఐశ్వర్య.. బోరున విలపించింది. టాయిలెట్​లో ఓ​ బట్టలో చుట్టి ఉన్న కుమార్తె కనిపించింది. దీనిపై దుదియల్​పుర్ పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. చిన్నారిని రక్షించారు.

ఘటన జరిగిన వెంటనే శాంతి పరారయిందని పోలీసులు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. గత కొన్నేళ్లుగా శాంతి మానసిక సమస్యలతో బాధపడుతోందని వారు తెలిపారు. ఆమెకు చికిత్స కొనసాగుతోందని చెప్పారు.

ఇదీ చూడండి: కూలిన మూడంతస్తుల భవనం.. ఐదుగురు మృతి

ఇదీ చూడండి: కుటుంబాన్ని వదిలి.. మరో మహిళను పెళ్లాడిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.