Suspicious Pigeon: ఒడిశా సుందర్‌గఢ్ రాజ్‌గంగ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంస్‌బహాల్ గ్రామంలో అనుమానాస్పద పావురం కన్పించింది. దాని కాలుకు చైనీస్ ట్యాగ్ ఉండంటంతో అధికారులు హూటాహుటిన రంగంలోకి దిగారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపి ఉంటారు? అనే విషయాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
![Suspicius Pigeon](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-sng-suspiciuspigeon-caughtatkanshbahal-sng-od10033_03012022200806_0301f_1641220686_195.jpg)
ఎలా దొరికిందంటే?
![Suspicius Pigeon](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-sng-suspiciuspigeon-caughtatkanshbahal-sng-od10033_03012022200806_0301f_1641220686_613.jpg)
సర్బేశ్వర్ ఛొత్రాయ్ అనే వ్యక్తి నివాసం సమీపంలో సోమవారం ఈ పావురం కన్పించింది. అతడు దాని దగ్గరకు వెళ్లినా అది కదల్లేదు. దీంతో సర్బేశ్వర్ దాన్ని పరిశీలించగా.. గాయపడినట్లు తెలిసింది. దాన్ని కాపాడే క్రమంలో కాలుకు ఓ చైనీస్ ట్యాగ్ ఉండటాన్ని సర్బేశ్వర్ గమనించాడు. చైనీస్ భాషలో ఏదో రాసిఉన్నట్లు చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వారు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.
![Suspicius Pigeon](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-sng-suspiciuspigeon-caughtatkanshbahal-sng-od10033_03012022200806_0301f_1641220686_93.jpg)
![Suspicius Pigeon](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-sng-suspiciuspigeon-caughtatkanshbahal-sng-od10033_03012022200806_0301f_1641220686_967.jpg)
ఇదీ చదవండి: India covid cases: దేశంలో కొత్తగా 37,379 మందికి కరోనా