ETV Bharat / bharat

ప్రేమ పేరుతో మోసం.. మైనర్​ను గర్భవతిని చేసిన యువకుడు - మైనర్​ను మోసం చేసిన యువకుడు

మైనర్​ బాలికను ఓ యువకుడు ప్రేమ పేరుతో మాయమాటలు చేప్పి గర్భవతిని చేశాడు. ఈ ఘటన గుజరాత్​లో జరిగింది. మరోవైపు, ఐఐటీ స్టూడెంట్​ హాస్టల్​ భవనంపై నుంచి దూకి మృతి చెందాడు.

surat girl student rape case
surat girl student rape case
author img

By

Published : Feb 12, 2023, 10:36 PM IST

గుజరాత్​లో మైనర్​పై అత్యాచారం జరిగిన ఘటన​ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాంధీనగర్​లో జరిగిన జాతీయ టోర్నమెంట్​లో పాల్గొనడానికి వెళ్లిన 17 ఏళ్ల యువతిని ఓ యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి.. గర్భవతిని చేశాడు. దీనిపై బాధితురాలి తల్లి​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సూరత్​కు చెందిన ఓ 17 ఏళ్ల బాలిక చదువుతో పాటుగా.. ఆటల్లోనూ ముందుండేది. ప్రస్తుతం ఆమె జునాగఢ్​లోని ఓ హాస్టల్​లో ఉండి చదువుకుంటోంది. ఈమె సాఫ్ట్​బాల్​ గేమ్​లో రాణించేది. దీంతో గతేడాది సెప్టెంబర్​లో గాంధీనగర్​లో జరిగిన జాతీయ స్థాయి టోర్నీకి ఎంపికైంది. ఆ టోర్నీలో పాల్గొనేందుకు ఆమె గాంధీనగర్​కు చేరుకుంది. అక్కడే ఆమెకు.. ఓ యువకుడితో పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. అదే సమయంలో వారిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ సోషల్​ మీడియాలో చాటింగ్​ చేసుకున్నారు.

అయితే అక్కడ నుంచి ఇంటికి చేరుకున్న బాలికకు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమె తల్లి బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లింది. బాలికకు వైద్యపరీక్షలు చేసిన వైద్యులు.. ఐదు నెలల గర్భవతి అని చెప్పడం వల్ల బాధితురాలి తల్లిదండ్రులు షాక్​కు గురయ్యారు. కూతురిని ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టింది. అయితే ఆ యువకుడికి సంబంధించిన మొబైల్​ నంబర్​తో సహా.. ఏ విషయాలు ఆమెకు తెలియదని చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

హాస్టల్​పై నుంచి దూకి ఐఐటీ స్టూడెంట్ మృతి​..
ఐఐటీ బాంబేలో ఓ విద్యార్థి హాస్టల్​ భవనంపై నుంచి దూకి చనిపోయాడు. అహ్మదాబాద్​కు చెందిన ఓ 18 ఏళ్ల యువకుడు ఐఐటీ బాంబేలో బీటెక్​ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం ఆ విద్యార్థి హాస్టల్ క్యాంపస్​లోని ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్‌లోని సెక్యూరిటీ గార్డులు రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా.. ప్రమాదవశాత్తు జారిపడినట్లు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.