ETV Bharat / bharat

'దేశద్రోహం చట్టం పునఃసమీక్షపై ముమ్మర కసరత్తు.. వర్షాకాల సమావేశాల నాటికి..'

author img

By

Published : May 1, 2023, 4:29 PM IST

స్వాతంత్ర్య కాలం నాటి దేశద్రోహం చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల​పై సుప్రీంకోర్టు విచారించింది. పునఃపరిశీలనపై ప్రభుత్వ సంప్రదింపులు పురోగతి దశలో ఉన్నాయని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపిన నేపథ్యంలో తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది.

sedition law
sedition law

దేశద్రోహం చట్టం 124 ఏ ఆర్టికల్​ పునఃసమీక్షపై ప్రభుత్వ సంప్రదింపులు పురోగతి దశలో ఉన్నాయని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర సర్కార్​. ఈ మేరకు అటార్నీ జనరల్​ ఆర్​ వెంకటరమణి సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. దేశద్రోహం చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం కేసును ఆగస్టుకు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్​, జస్టిస్ జేబీ పార్ధీవాలాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్​ను విచారించింది.

దేశద్రోహం చట్టం పునఃసమీక్ష సంప్రదింపులు పురోగతి దశలో ఉన్నాయని.. వర్షాకాల పార్లమెంట్​ సమావేశాల తర్వాత విచారణ చేపట్టాలని అటార్నీ జనరల్​ కోర్టును కోరారు. పార్లమెంటుకు వెళ్లే ముందే ఆ వివరాలు తెలియజేస్తామని సుప్రీంకోర్టుకు నివేదించారు. దీనికి అంగీకరించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది. ఈ విచారణ ఆరంభంలో మరో సీనియర్​ న్యాయవాది గోపాల్​ శంకర్​నారాయణన్​.. ఈ సమస్య పరిష్కారానికి ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్​ను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. ఏడుగురు సభ్యుల బెంచ్​కు ముందు ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని గుర్తు చేసింది.

అంతకుముందు గతేడాది మే 11న సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును ఇచ్చింది. స్వాతంత్ర్య కాలం నాటి చట్టమైన దేశద్రోహాం అమలుపై స్టే విధించింది. భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్‌ 124ఏ నిబంధనపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష జరిపి తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు దాని అమలును నిలిపేస్తూ కీలకమైన ఆదేశాలిచ్చింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమాకోహ్లీతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజద్రోహ చట్ట రాజ్యాంగబద్ధత అంశం ప్రభుత్వ పునఃపరిశీలనలో ఉన్నందున దీని కింద కొత్తగా కేసులు నమోదు చేసే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనం పాటించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఐపీసీ సెక్షన్‌ 124ఏ కింద నమోదైన అన్ని కేసులు, అప్పీళ్లు, ప్రొసీడింగ్స్‌నూ ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ఒకవేళ ఎవరిపైనైనా ఈ సెక్షన్‌తో పాటు, ఇతర సెక్షన్ల కిందా కేసులు నమోదు చేసి ఉంటే మిగిలిన సెక్షన్ల కింద విచారణ కొనసాగించవచ్చని తెలిపింది.

కోర్టులో సవాల్‌ చేసింది వీరే..
ఎడిటర్స్‌ గిల్డ్‌, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ శౌరి, మేజర్‌ జనరల్‌(రిటైర్డ్‌) ఎస్‌.జి.వొంబత్కెరె, పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌(పీయూసీఎల్‌).

రాజద్రోహం కేసుల బాధితుల్లో ప్రముఖులు..
జాతీయ నేరాల నమోదు విభాగం(ఎన్‌సీఆర్‌బి) నివేదిక ప్రకారం దేశద్రోహం కింద 2015-2020 మధ్య కాలంలో మొత్తం 356 కేసులు దాఖలయ్యాయి. 548 మంది వ్యక్తులు అరెస్టయ్యారు. వీరిలో ఆరుగురిపైనే నేరాలు నిరూపితమై శిక్షలు పడ్డాయి. రాజద్రోహం కేసులు నమోదైన వారిలో.. బెంగుళూరుకు చెందిన దిశారవి(టూల్‌ కిట్‌ కేసు), దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు కన్హయ్య కుమార్‌, ఉమర్‌ ఖలీద్‌, అనిర్భన్‌ భట్టాచార్య, కేరళ పాత్రికేయుడు సిద్దిఖీ కప్పన్‌, దివంగత పాత్రికేయుడు వినోద్‌ దువా, బుకర్‌ ప్రైజ్‌ విజేత, రచయిత్రి అరుంధతి రాయ్‌, హార్దిక్‌ పటేల్‌(గుజరాత్‌), అసీమ్‌ త్రివేది(కార్టూనిస్ట్‌, కాన్పుర్‌), వినాయక్‌సేన్‌( పిల్లల వైద్యుడు, ఛత్తీస్‌గఢ్‌), సిమ్రాన్‌జిత్‌ సింగ్‌ మాన్‌(పంజాబ్‌) తదితరులు ఉన్నారు.

ఇవీ చదవండి : 'అలాంటి కేసుల్లో తక్షణమే విడాకులు'.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

'లావుగా ఉన్న పోలీసులకు VRS.. ఖాళీ అయిన పోస్టులకు త్వరలో నియామకం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.