ETV Bharat / bharat

ఆన్‌లైన్లో విడుదలయ్యే సినిమాలపై కమిటీ ఎలా వేయగలం?: సుప్రీంకోర్టు

ఆన్‌లైన్‌ మాధ్యమంలో నేరుగా విడుదలయ్యే వెబ్‌ సీరీస్‌, చిత్రాలు, ఇతర కార్యక్రమాలను ముందుగా పరిశీలించడానికి 'ప్రీ స్క్రీనింగ్‌ కమిటీ'ని ఎలా ఏర్పాటు చేయగలమని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మరోవైపు, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని హత్యచేసిన కేసులో దోషులు నళిని, ఆర్‌.పి.రవిచంద్రన్‌ల ముందస్తు విడుదలకు తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సుముఖత వ్యక్తపరిచింది.

supreme court on online release webseries and movies

author img

By

Published : Oct 14, 2022, 7:31 AM IST

Updated : Oct 14, 2022, 7:44 AM IST

ఆన్‌లైన్‌ మాధ్యమంలో నేరుగా విడుదలయ్యే వెబ్‌ సీరీస్‌, చిత్రాలు, ఇతర కార్యక్రమాలను ముందుగా పరిశీలించడానికి 'ప్రీ స్క్రీనింగ్‌ కమిటీ'ని ఎలా ఏర్పాట చేయగలమని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ మీర్జాపుర్‌ వాసి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఓవర్‌-ది-టాప్‌ (ఓటీటీ)కి కూడా ప్రస్తుత చట్టం వర్తించాలని కోరవచ్చేగానీ ఇతర దేశాల నుంచి ప్రసారమయ్యేవాటిని అడ్డుకోవాలంటే అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని పేర్కొంది. మరింత వివరంగా అర్జీని దాఖలు చేయాలని సూచిస్తూ, ప్రస్తుత పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించింది.

నళిని ముందస్తు విడుదలకు తమిళనాడు సుముఖం
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని హత్యచేసిన కేసులో దోషులు నళిని, ఆర్‌.పి.రవిచంద్రన్‌ల ముందస్తు విడుదలకు తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సుముఖత వ్యక్తపరిచింది. వీరి యావజ్జీవ కారాగార శిక్షను తగ్గిస్తూ 2018లో మంత్రివర్గ సలహాకు గవర్నర్‌ కట్టుబడి ఉండాలని పేర్కొంది.

అదానీ గిడ్డంగుల వివాదంలో మంత్రిత్వ శాఖలపై అసంతృప్తి
అదానీ ఓడరేవుల ప్రత్యేక ఆర్థిక మండలి లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఈజడ్‌ఎల్‌)కు చెందిన సెజ్‌లో గిడ్డంగుల సదుపాయానికి సంబంధించి కేంద్రానికి చెందిన వేర్వేరు మంత్రిత్వ శాఖలు పరస్పర విరుద్ధ వైఖరిని కనపరచడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తపరిచింది. దీనిని ప్రభుత్వ స్థాయిలోనే పరిష్కరించాలని అభిప్రాయపడింది. ఈ విషయంలో గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం కొట్టివేసింది.

ఇవీ చదవండి:పది నెలల్లో 13 మంది బలి.. ఎట్టకేలకు చిక్కిన 'సీటీ-1' పులి

పండగ రోజు ప్రేయసితో భర్త షాపింగ్.. బడితపూజ చేసిన భార్య

Last Updated : Oct 14, 2022, 7:44 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.