ETV Bharat / bharat

'తప్పు చేస్తే ఇప్పటికీ నా కుమారుడ్ని కొడతా'.. సీక్రెట్ చెప్పేసిన సీఎం తల్లి - హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికలు 2022

హిమాచల్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సుఖు ప్రమాణ స్వీకారం చేయడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సుఖు బాధ్యతలు చెపట్టడంపై ఆయన తల్లి స్పందించారు. తప్పు చేస్తే ఇప్పటికీ కుమారుడ్ని కొడతానని చెప్పారు.

himachal pradesh cm motther news today
himachal pradesh cm motther news today
author img

By

Published : Dec 11, 2022, 7:25 PM IST

తప్పు చేస్తే.. తన కుమారుడ్ని ఇప్పటికీ కొడతానని చెప్పారు హిమాచల్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేసిన సుఖ్విందర్ సుఖు తల్లి సంసారో దేవీ. సుఖ్విందర్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై ఆమెతోపాటు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సుఖును ప్రభుత్వ ఉద్యోగిని చేయాలనుకున్నాని.. కానీ ఆయన రాజకీయాల్లోకి వెళ్లారని సుఖు తల్లి తెలిపారు. కొడుకు ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లికి బిడ్డేనని.. పెళ్లైన తర్వాత కూడా అనేక సార్లు సుఖును కొట్టానని ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖిలో గుర్తుచేసుకున్నారు. ఇంత వయసు, హోదా వచ్చినా.. ఏనాడూ తనకు ఎదురు చెప్పలేదని అన్నారు సంసారో దేవి.

కళాశాలకు వెళ్లినా.. రాజకీయ కార్యక్రమాల్లోనే ఎక్కువగా పాల్గొనేవారని, ఇంటికి ఎప్పుడూ ఒంటరిగా వచ్చేవారు కాదని గుర్తు చేసుకున్నారు సుఖ్విందర్ తల్లి సంసారో దేవి. ఆయనతో వచ్చిన ప్రతి ఒక్కరికీ భోజనం పెట్టే పంపించానని చెప్పారు. తన భర్త రూ.90 జీతంతో ఆరుగురు ఉన్న కుటుంబాన్ని పోషించేవారని తెలిపారు. తన భర్త.. రాజకీయ నాయకుల వాహనాలు నడిపేవారని.. ఇప్పుడు తన కుమారుడే రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు సుఖు.

హిమాచల్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రి తల్లి

సుఖు కుమార్తెల హర్షం
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై సుఖ్విందర్ కుమార్తెలు కమ్నా ఠాకూర్​, రహూన్​ ఠాకూర్​ సంతోషం వ్యక్తం చేశారు. తన తండ్రికి ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలందరికీ ధన్యావాదాలు తెలిపారు. కాంగ్రెస్​ ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే అమలు చేస్తారనే నమ్మకం తమకుందన్నారు. మహిళల సాధికారత కోసం కాంగ్రెస్​ అనేక హామీలు ఇచ్చిందని.. వాటన్నింటినీ నెరవేరుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగ కల్పనకు సరైన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.

వృత్తిరీత్యా న్యాయవాది అయిన సుఖు.. హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ నుంచి ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు. రెండుసార్లు శిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. వర్సిటీ రాజకీయాల్లో దూకుడు కారణంగా.. ఆయనకు ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు ఉంది. 2013 నుంచి 2019 మధ్య రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న సమయంలో.. పార్టీని బలోపేతం చేశారు. ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిందని రాజకీయ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు.

ఇవీ చదవండి: హిమాచల్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సుఖ్విందర్ సుఖు

పాల విక్రేత నుంచి సీఎం వరకు.. హిమాచల్ నూతన ముఖ్యమంత్రి విజయ ప్రస్థానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.