ETV Bharat / bharat

మహిళపై ఎస్సై పలుమార్లు అత్యాచారం.. అసభ్యకరమైన వీడియోలు తీసి.. - లవ్​ జిహాద్ కేసు నోయిడా

మహిళా రచయితపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఎస్సై. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది. మరోవైపు, పరిచయం ఉన్న ఓ యువతిపై అత్యాచారం చేశాడు యువకుడు. అనంతరం ఆమె తలపై దాడి చేశాడు. దీంతో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణం ఛత్తీస్​గఢ్​లో జరిగింది.

police raped a woman
మహిళపై ఎస్సై అత్యాచారం
author img

By

Published : Dec 29, 2022, 8:15 PM IST

మహిళపై ఓ ఎస్సై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ దారుణాన్ని వీడియో తీసి ఆమెను బెదిరించాడు. అలా నెలల తరబడి బాధితురాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​.. గాజియాబాద్​లో జరిగింది. బాధితురాలు కవయిత్రి అని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఈ ఏడాది ఏప్రిల్ 25న దాస్నాలో బాధితురాలు తన ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై నిలబడి ఉంది. ఇంతలో కవినగర్​ ప్రాంతానికి చెందిన అక్షయ్ మిశ్ర అనే సబ్ ఇన్‌స్పెక్టర్.. అక్కడికి చేరుకున్నాడు. అనంతరం ఆమె ఫోన్ నంబర్​ను తీసుకున్నాడు. అలా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. మే4న నిందితుడు.. బాధితురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడ టీలో మత్తుమందు కలిపి బాధితురాలికి ఇచ్చాడు. స్పృహ తప్పి పడిపోయిన అనంతరం మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని వీడియో తీసి బెదిరింపులకు దిగాడు. అలా పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు గర్భం దాల్చింది. ఆమెను బెదిరించి అబార్షన్ చేసుకునేటట్లు చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సైపై కేసు నమోదు చేసుకున్నారు.

మద్యం మత్తులో..
ఛత్తీస్​గఢ్​ దంతెవాడలో దారుణం జరిగింది. 22 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. అనంతరం ఆమె తలపై కొట్టి అక్కడి నుంచి తన స్నేహితుడితో కలిసి బైక్​పై పరారయ్యాడు. ఈ ఘటనలో కడంపాల్‌కు చెందిన బుదరూ(22), బిజు రామ్ (20)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
డిసెంబరు 25న పదపుర్​ సమీపంలో ఓ యువతి అపస్మారక స్థితిలో స్థానికులకు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలిని అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. యువతి మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించగా ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేలింది. తలపై బలమైన గాయం కావడం వల్లే మరణించిందని నివేదికలో వెల్లడైంది.

బుదరూ అనే యువకుడితో బాధితురాలికి పరిచయం ఉంది. నిందితుడు బుదరూకి అప్పటికే వివాహమైంది. అయినప్పటికీ యువతితో సన్నిహితంగా ఉండేవాడు. ఈ నెల 24న కలుద్దామని బాధితురాలికి చెప్పాడు నిందితుడు. అతడి స్నేహితుడు బిజూ రామ్​తో కలిసి బైక్​పై బాధితురాలిని అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ముగ్గురు కలిసి పూటుగా మద్యం సేవించారు. దీంతో బాధితురాలు స్పృహ కోల్పోయింది. ఇదే అదునుగా భావించి బుదరూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం స్నేహితుడితో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడు.

పేరు మార్చుకుని..
ఉత్తర్​ప్రదేశ్​లోని గ్రేటర్ నోయిడాలో మరో లవ్​జిహాద్ కేసు వెలుగు చూసింది. ఇంతెజార్ అనే వ్యక్తి తన పేరు సోనూ అని చెప్పి ఓ యువతిని ప్రేమలోకి దింపాడు. అనంతరం ఆమెకు జ్యూస్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడి తండ్రి అబ్బాస్, సోదరుడు సోహైల్ బాధితురాలిని మతం మార్చుకుని.. ఇంతెజార్​ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. బాధితురాలు తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. ముగ్గురు నిందితులపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.