కరోనా కాలంలో ఎన్నో సహాయ కార్యక్రమాలు చేసిన బాలీవుడ్ నటుడు సోనూసూద్.. రాజకీయాల్లో చేరుతారని కొద్దికాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరి(Sonu sood sister) మాళవిక సూద్ పోటీ చేస్తారని తెలిపారు. ఈ మేరకు మోగాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తాను రాజకీయాల్లోకి (Sonu sood politics) వస్తానన్న వార్తలను మాత్రం సోను ఖండించారు. ప్రస్తుతం తనకు ఆ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తన సోదరి (Sonu sood sister) కచ్చితంగా పంజాబ్ ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తారని పేర్కొన్నారు. ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. సమయం వచ్చినప్పుడు మాళవిక (Sonu sood sister) ఏ పార్టీలో చేరుతారనే విషయాన్ని ప్రకటిస్తానని పేర్కొన్నారు.
నమ్మకం గెలిచేందుకు ప్రయత్నిస్తాం..
పంజాబ్ ప్రజల నమ్మకం గెలుచుకునేందుకు తాము ప్రయత్నిస్తానని సోనూసూద్ తెలిపారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. అయితే.. ఓటు వేసే సమయంలో పార్టీలను కాకుండా.. అభ్యర్థుల ముఖాలను చూసి ఓటు వేయాలని అన్నారు.
సీఎంతో సోనూ భేటీ
చండీగఢ్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీతో శుక్రవారం సోను సమావేశం అయ్యారు. అయితే.. భేటీ అనంతరం వారిరువురూ మీడియాతో ఏమీ మాట్లాడలేదు. అంతకుముందు దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో కూడా సోనూసూద్ భేటీ అయ్యారు.
డెంగీ బాధితులకు అండగా..
తాను ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధమేనని సోను తెలిపారు. డెంగీ బాధితులు చికిత్స కోసం తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. బాధితుల కుటుంబ సభ్యులకు తాము రూ.5,000 అందజేస్తామని తెలిపారు. తద్వారా వారు ఏ ఆస్పత్రుల్లోనైనా చికిత్స పొందగలరని చెప్పారు.
ఇదీ చూడండి: SONU SOOD HELP: సోనూసూద్ దాతృత్వం.. ఈసారి ఏం చేశారో చూడండి