ETV Bharat / bharat

లక్కీ మ్యాన్.. అరగంటలో కష్టాలు ఉఫ్​.. ఇల్లు అమ్మేటప్పుడు రూ.కోటి లాటరీ! - మహమ్మద్​ బవ

అప్పుల్లో కూరుకుపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆ వ్యక్తి తన ఇంటిని అమ్మేందుకు సిద్ధపడ్డాడు. మరికాసేపట్లో ఆ ఇంటిని ఇంకొకరికి అప్పచెప్తాడు అనగా అదృష్టం తలుపు తట్టింది. అరగంట క్రితం రూ.50 పెట్టి కొన్న ఓ లాటరీ టికెట్​.. అదృష్టంలా వరించింది. రూ.కోటి జాక్​పాట్​ అతని సొంతమైంది.

కేరళ
కేరళ
author img

By

Published : Jul 27, 2022, 3:18 PM IST

Updated : Jul 27, 2022, 4:17 PM IST

కేరళ వ్యక్తికి రూ.కోటి లాటరీ

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో ఎవ్వరమూ చెప్పలేం. కొందరికి అలా కలిసి వస్తుందంతే..! కేరళలోని కాసరగోడ్​లో తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిన వ్యక్తిని అదృష్టం లాటరీ రూపంలో వరించింది. అప్పులు తీర్చేందుకు తన కలల ఇంటిని అమ్మడానికి కొద్ది గంటల ముందే ఓ వ్యక్తికి లాటరీలో ఏకంగా రూ.కోటి జాక్‌పాట్ తగలగా అతడి జీవితమే మారిపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కాసరగోడ్​కు చెందిన మహమ్మద్‌ బవ (50 ఏళ్లు) పెయింటర్‌గా పని చేస్తున్నాడు.‌ అతడికి భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఎనిమిది నెలల క్రితమే 2వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని ఎంతో ఇష్టంతో కట్టుకున్నాడు. అయితే, తన ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు.. తన కుమారుడు నిజాముద్దీన్‌ను ఖతార్‌ పంపేందుకు బ్యాంకులు, బంధువుల నుంచి దాదాపు రూ.50లక్షల వరకు రుణం తీసుకొని తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. వాటిని తీర్చేందుకు ఇంటిని రూ.40లక్షలకు విక్రయించేందుకు సిద్ధమైన బవ.. సోమవారమే కొంత మొత్తాన్ని అడ్వాన్సుగా తీసుకున్నాడు.

తమకు ఉన్న ఒకే ఒక్క ఆస్తి ఈ ఇల్లేనని.. దాన్ని అమ్మేశాక కుటుంబంతో కలిసి అద్దె ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు బవ తెలిపినట్టు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, తన స్నేహితులు ఎవరూ తనకు సాయం చేయకపోవడం వల్ల జాక్‌పాట్‌ తగులుతుందన్న ఆశతో లాటరీ టిక్కెట్లు కొంటుండేవాడు. ఇందులో భాగంగా తాజాగా లాటరీ డ్రా తీయగా తనకు జాక్‌పాట్ తగిలిందన్న విషయం బవకు తెలియడంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. లాటరీ మొత్తంలో పన్నులన్నీ మినహాయించగా బవ చేతికి రూ.63లక్షలు అందనుంది. అయితే, ఇంటిని కొనుగోలు చేసేందుకు సిద్ధం కావడంతో ఈరోజు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రాగా.. విక్రయించేందుకు అతడు విముఖత వ్యక్తంచేసినట్టు సమాచారం.

ఇదీ చూడండి : వరదల్లో కొట్టుకుపోయిన వ్యక్తి.. 14 రోజుల తర్వాత మళ్లీ..

Last Updated : Jul 27, 2022, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.