Solar Cycle: పెట్రోధరల మంటతో సతమతమవుతున్న వాహనదారులకు తమిళనాడు మధురైకి చెందిన ధనుష్ కుమార్ సరికొత్త మార్గం సూచించారు. సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్ తయారుచేశాడు. ఈ సైకిల్‌ను తయారు చేయడానికి ధనుష్ కుమార్ సైకిల్ క్యారియర్‌పై బ్యాటరీని అమర్చాడు. దాని ముందు భాగంలో సోలార్ ప్యానెల్ అమర్చారు. ఈ సోలార్ ప్యానెల్ ద్వారా ఈ సైకిల్‌తో ఆగకుండా 50 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. విశేషమేమిటంటే ఛార్జింగ్ తగ్గినా 20 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. ప్రభుత్వం నుంచి తన సోదరి పొందిన సైకిల్‌నే ఎలిక్ట్రిక్ సైకిల్‌గా మార్చినట్లు ధనుష్ తెలిపాడు.
![Solar Cycle](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14829533_imh3.jpg)
పెట్రోలుతో పోలిస్తే ఈ బ్యాటరీ వినియోగించే విద్యుత్ ఖరీదు చాలా తక్కువని ధనుష్ అంటున్నారు. దీంతో కేవలం రూపాయిన్నర ఖర్చుతో 50 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు. ఈ సైకిల్ 30 నుంచి 40 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో వెళ్తోంది. దీని వేగం ద్విచక్రం వాహనంతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో ప్రయాణించడానికి సరిపోతుందని తెలిపారు. వేగాన్ని అదుపు చేయడానికి సైకిల్‌కు ఆక్సిలరేటర్, పెండల్స్‌ను సైతం అమర్చారు.
![Solar Cycle](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14829533_imh6.jpg)
సోలార్ పవర్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ సైకిల్ తొక్కవచ్చు. దీనిని భౌతికశాస్త్ర ప్రొఫెసర్ల సూచనలతో రూపొందించినట్లు ధనుష్ తెలిపారు. సైకిల్ ధర దాదాపు 25వేలు అని వెల్లడించారు. అయితే అసలు ఖరీదు 18వేలకు మించి ఉండదని వివరించారు. అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ సైకిల్‌ను రూపొందించిన ధనుష్ కుమార్‌ను నెటిజనులు ప్రశంసిస్తున్నారు.
ఇదీ చదవండి: Azadi Ka Amrit Mahotsav: పచ్చని అడవిలో ఆంగ్లేయుల చిచ్చు