ETV Bharat / bharat

కారులో టెకీ ఆత్మహత్మ.. ముఖానికి ప్లాస్టిక్ కవర్​.. నోట్లో నైట్రోజన్​ పైపు..

గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఓ సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​ ఆత్మహత్మకు పాల్పడ్డాడు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. తన సొంత కారులోనే ఆ వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు.

Software engineer commits suicide in Karnatak
ఆత్మహత్మ చేసుకున్న సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​
author img

By

Published : Dec 21, 2022, 10:37 PM IST

సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​ ఆత్మహత్మకు పాల్పడ్డ ఘటన కర్ణాటకలో జరిగింది. గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అతడు.. తన సొంత కారులోనే ప్రాణాలు తీసుకున్నాడు. బెంగళూరులో ఈ విషాదకర ఘటన జరిగింది. కాగా మృతుడిని విజయ్ కుమార్​(51)గా గుర్తించారు. అతడు నగరంలోని ఓ ప్రముఖ సాఫ్ట్​వేర్​ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

Software engineer commits suicide in Karnatak
ఆత్మహత్మ చేసుకున్న సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్ కుమార్ (51)కు కొద్ది రోజుల క్రితం గుండె సంబంధించిన సమస్య ఉందని తెలిసింది. దీనిపై విజయ్​ కుమార్​ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తాను చాలా రోజులు బతకనని కుటుంబ సభ్యులకు చెబుతూ.. బాధ పడేవాడు. బుధవారం కారు వాష్ కోసమని చెప్పి.. బయటకు వెళ్లాడు విజయ్​ కుమార్​. మహాలక్ష్మి లేఅవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుబరహళ్లి జంక్షన్‌ రోడ్డు పక్కన కారు ఆపాడు. అనంతరం అటుగా వెళుతున్న వ్యక్తికి కొంత డబ్బును ఇచ్చి.. తాను కారులో కూర్చున్న తరువాత వాహనానికి కవర్​ కప్పమని చెప్పాడు. అనంతరం ఓ ప్లాస్టిక్ కవర్​ను మొహానికి చుట్టుకొని, నోట్లో నైట్రోజన్​ పైపు పెట్టుకొని చనిపోవడానికి ప్రయత్నించాడు.

రోడ్డు పక్కనే కవర్​తో కప్పి ఉంచిన కారు గమనించిన స్థానికులు.. సమాచారాన్ని పోలీసులుకు అందజేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం కారును పరిశీలించగా.. కారు వెనుక సీట్లో విజయ్​ కుమార్​ అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు పోలీసులు. అప్పటికే విజయ్​ కుమార్ చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధరించారు. అనంతరం ఘటనపై మృతుడి కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఘటనపై కేసు చేసుకున్నామని, విచారణ సైతం చేస్తున్నామని వారు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.