ETV Bharat / bharat

ఆస్పత్రికి పిలిచి చిన్నారిపై ప్యూన్ అత్యాచారం... కారుపై సేదతీరాడని దారుణం

వారిద్దరికీ ఇదివరకే పరిచయం ఉంది. ఇరుగుపొరుగున ఉండే వారి మధ్య స్నేహం కుదిరింది. ఇదే అదునుగా చేసుకున్న ఓ యువకుడు ఆ బాలికను ఆస్పత్రికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు.

minor raped in delhi
minor raped in delhi
author img

By

Published : Nov 4, 2022, 6:47 PM IST

దిల్లీలోని షాహదారా జిల్లాలోని ఓ ఆస్పత్రిలో పదహారేళ్ల బాలికపై అక్కడ పని చేస్తున్న దీపక్​ అనే ఓ ప్యూన్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక బంధువుల ఫిర్యాదుతో విషయం వెలుగులోకి రాగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆ బాలికకు నిందితుడికి ఇదివరకే పరిచయం ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఉత్తర్​ప్రదేశ్​ ఘాజియాబాద్​కు చెందిన దీపక్​ దిల్లీలోని షాహదారాలోని ఓ సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్యూన్‌గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలికతో అతనికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఇదే అదునుగా చేసుకుని ఓ రోజు ఏదో కారణం చెప్పి బాలికను ఆస్పత్రికి పిలిపించాడు. అతని మాటలు విని బాలిక ఆస్పత్రికి వెళ్లగా ఓ రూంకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన సోదరికి చెప్పగా.. ఆమె తన కుటుంబసభ్యులకు తెలియజేసింది. దీంతో వారు దీపక్​పై పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు..సెక్షన్​ 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

కారుపై సేదదీరిన బాలుడ్ని తన్నాడు...
ఉత్తర కేరళ జిల్లాలోని తలస్సేరిలో ఓ హృదయ విదారక ఘటన జరిగింది. తన కారుపై సరదాగా వాలినందుకు ఆరేళ్ల బాలుడిని ఓ యువకుడు దారుణంగా తన్నాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరలవ్వగా.. దాన్ని స్థానిక ఛానళ్లలో ప్రసారం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగింది: రాజస్థాన్ నుంచి కేరళకు వలస వచ్చిన ఓ కార్మిక కుటుంబానికి చెందిన బాలుడు ..రహదారి పక్కన పార్క్​ చేసిన కారుపై కాసేపు సేదతీరాడు. దీన్ని గమనించిన కారు యజమాని కోపంతో ఊగిపోయి బాలుడ్ని విచక్షణరహితంగా తన్నాడు. ఇది గమనించిన స్థానికులు అతని వద్దకు వచ్చి ప్రశ్నించగా అతను కారు ఎక్కి పరారయ్యాడు. స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా కారు నెంబర్​ను ట్రేస్​ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టాక అతన్ని రిమాండ్​కు తరలించారు.

బిడ్డను సభకు తీసుకొచ్చారని కామెంట్లు...
కేరళలో ఓ మహిళ ఐఏఎస్​ అధికారి తన బిడ్డను పబ్లిక్​ ఫంక్షన్​కు తీసుకురావడంపై సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీసింది. అలా తీసుకురావడం సరైనది కాదని దీంతో ఆమె సభను అవమాన పరిచిందని పలువురు నెటిజన్లు కామెంట్​ చేశారు.

అడూర్​లో అక్టోబర్​ 30న జరిగిన ఆరో అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ముగింపు కార్యక్రమంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఈవెంట్​ నిర్వకుల్లో ఒకరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేయగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పతనంతిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకకు తన మూడున్నరేళ్ల చిన్నారిని తీసుకొచ్చారు. సభవేదిక పై కూర్చున్న ఆమె కాసేపు పిల్లాడితో ఆడుకున్నారు. ఆమె ప్రసంగం ఇచ్చే సమయంలో ఆ పిల్లాడిని కూడా మైక్​ వద్దకు తీసుకెళ్లారు. దీనిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే, కలెక్టర్ భర్తతో పాటు కేరళలోని పలువురు ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు.

ఇదీ చదవండి:గుజరాత్​లో ఆప్ సీఎం అభ్యర్థిగా ఈశుదాన్ గఢ్వీ

రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళపైకి దూసుకెళ్లిన కారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.