ETV Bharat / bharat

వంతెన పైనుంచి నదిలో పడ్డ లారీ- ఆరుగురు మృతి - మధ్యప్రదేశ్ వార్తలు

మధ్యప్రదేశ్​ బెతూల్​లోని తవా నది వంతెనపై వెళుతున్న ఓ లారీ అదుపు తప్పి నీటిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ఆరుగురు మరణించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవటం వల్లనే లారీ వంతెన రెయిలింగ్స్​ను ఢీకొట్టి నదిలో పడిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు పోలీసులు.

MP-ACCIDENT-TRUCలారీK
లారీ
author img

By

Published : Nov 17, 2020, 5:00 PM IST

మధ్యప్రదేశ్ బెతూల్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తవా నది వంతెనపై ఇనుప రాడ్ల లోడ్​తో వెళుతున్న ఓ లారీ అదుపు కింద తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ఆరుగురు మరణించారు.

తొలుత వంతెన రెయిలింగ్స్​ను ఢీకొట్టిన లారీ.. అలాగే పల్టీ కొట్టి నదిలో పడిపోయింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

లారీతో పాటు మృతులను వెలికితీసేందుకు క్రేన్​తో సహాయక చర్యలు చేపడతున్నారు పోలీసులు. ఇందులో చనిపోయిన వారంతా పిపిరీ గ్రామానికి చెందినవారని తెలుస్తోంది.

ఇదీ చూడండి: ఘోర ప్రమాదం.. కారులో ఐదుగురు సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.