ETV Bharat / bharat

'పాక్‌లో ఆరుగురు భారత ఖైదీల మృతి ఆందోళనకరం.. వారి భద్రత ఆ దేశానిదే' - indian prisoners in pakistan

గత తొమ్మిది నెలల వ్యవధిలో పాకిస్థాన్​లో భారత్​కు చెందిన ఆరుగురు ఖైదీలు మృతి చెందడం ఆందోళనకరమని కేంద్రం పేర్కొంది. ఈ అంశాన్ని పాక్ వద్ద లేవనెత్తినట్లు కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.

Six Indian prisoners died
పాకిస్థాన్ జైల్లో ఆరుగురు భారతీయ ఖైదీలు మృతి
author img

By

Published : Oct 7, 2022, 10:40 PM IST

గత తొమ్మిది నెలల వ్యవధిలో పాకిస్థాన్‌లో భారత్‌కు చెందిన ఆరుగురు ఖైదీలు మృతి చెందడం ఆందోళనకరమని కేంద్రం పేర్కొంది. మృతుల్లో ఐదుగురు మత్స్యకారులే ఉన్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి అన్నారు. ఈ అంశాన్ని పాకిస్థాన్‌ వద్ద లేవనెత్తినట్లు వెల్లడించారు. శుక్రవారం ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు. అయితే, వీరంతా పాకిస్థాన్‌లో శిక్షను పూర్తి చేసుకున్నవారేనని తెలిపారు. ఈ పరిస్థితి తీవ్ర ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లో ఉన్న భారతీయ ఖైదీలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆ దేశానిదేనని గుర్తుచేశారు. అలాగే, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఇటీవల పాకిస్థాన్‌ యూఎస్‌ రాయబారి డొనాల్డ్‌ బ్లోమే పర్యటనపై అభ్యంతరాలను అమెరికాకు తెలిపామన్నారు. పీవోకేలో ఆయన సమావేశాలు నిర్వహించడం పట్ల కూడా అభ్యంతరం చెప్పినట్టు చెప్పారు.

భారత్‌-చైనా సరిహద్దులో పరిస్థితులు ఇంకా అలానే..
భారత్‌-చైనా సరిహద్దు వివాదం అంశంలో కొన్ని సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ పరిస్థితులు ఇంకా పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి రాలేదని కేంద్రం వెల్లడించింది. "భారత్‌-చైనా మధ్య పరిస్థితులు సాధారణ స్థాయికి రాలేదు. అయితే కొన్ని సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. సరిహద్దు ప్రాంతంలో శాంతి స్థాపనకు ఇరు దేశాలూ కృషి చేయాలి" అని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్​ బాగ్చి తెలిపారు.

ఇవీ చదవండి: ఉబర్​, ఓలా, ర్యాపిడోపై నిషేధం.. తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు

పార్టీ కార్యకర్తతో మహిళా ఎమ్మెల్యే పెళ్లి.. చీఫ్​ గెస్ట్​గా సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.