ETV Bharat / bharat

Sister Kidney Donation to Brother : అన్నకు కిడ్నీ ఇచ్చిన చెల్లి.. సోదరుడికి నిజమైన రక్షాబంధన్ కానుక! - హరేంద్ర ప్రియాంక కిడ్నీ దానం

Sister Kidney Donation to Brother : దేశంలో రక్షాబంధన్ సందడి ప్రారంభమైంది. తోడబుట్టినవారికి జీవితాంతం అండగా ఉంటానని సోదరులు హామీ ఇచ్చే రోజు ఇది. అయితే, దిల్లీలో ఓ యువతి తన సోదరుడికి అరుదైన రక్షాబంధన్ కానుక ఇచ్చింది! అనారోగ్యంతో బాధపడుతున్న తన అన్నకు కిడ్నీని దానం చేసింది.

Sister Kidney Donation to Brother
Sister Kidney Donation to Brother
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 9:08 AM IST

Sister Kidney Donation to Brother : మూత్రపిండం వైఫల్యంతో బాధపడుతున్న సోదరుడికి తన కిడ్నీని ఇచ్చి ప్రశంసలు అందుకుంటోంది ఓ యువతి. సోదరుడికి రక్షాబంధన్ కానుక అన్నట్లుగా.. శరీరంలోని ఓ భాగాన్నే దానం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. దిల్లీకి చెందిన హరేంద్ర(35) సేల్స్​మన్​గా పని చేస్తున్నాడు. గతేడాది నుంచి అతడికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. నీరసం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకున్నాడు.

అందులో హరేంద్ర కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తేలింది. 2022 డిసెంబర్ నాటికి అతడి పరిస్థితి మరింత దిగజారింది. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవడం తప్పనిసరైంది. అయితే, అతడి కంపెనీ వారానికి మూడు రోజులు సెలవు ఇచ్చేందుకు నిరాకరించింది. ఇక చేసేదేమీ లేక అతడు ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మానసికంగానూ కుంగిపోయాడు హరేంద్ర.

అయితే, హరేంద్ర అవస్థలను గుర్తించిన అతడి సోదరి ప్రియాంక(23) సాహసోపేత నిర్ణయం తీసుకుంది. తన అన్నకు కిడ్నీని దానం చేయాలని నిశ్చయించుకుంది. తొలుత ఈ నిర్ణయాన్ని కుటుంబసభ్యులంతా స్వాగతించారు. కానీ, భవిష్యత్​లో ప్రియాంకకు ఏవైనా సమస్యలు వస్తాయన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. పిల్లల్ని కనే సమయంలో ప్రియాంక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసినవారు హెచ్చరించారు. కానీ ప్రియాంక మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. సోదరుడికి కిడ్నీ దానం చేసి తీరుతానని గట్టిగా చెప్పేసింది.

Sister Kidney Donation to Brother
ప్రియాంక

క్లిష్టమైన ఆపరేషన్..
దీంతో హరేంద్రకు ఆపరేషన్ నిర్వహించేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. అయితే, వారికి మరో సమస్య ఎదురైంది. ప్రియాంక కిడ్నీకి మూడు ధమనులు ఉండటం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. 'ఈ కిడ్నీ ఆపరేషన్ ప్రక్రియ సంక్లిష్టమైనది. ప్రియాంక మూత్రపిండానికి మూడు ధమనులు ఉన్నాయి. సాధారణంగా కిడ్నీలకు రెండు ధమనులే ఉంటాయి. కాబట్టి ఈ ఆపరేషన్ నిర్వహించడం కొంచెం కష్టం. ఇలాంటి కేసుల్లో నాళలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతుంటాయి' అని నెఫ్రాలజీ డిపార్ట్​మెంట్ హెడ్ డాక్టర్ పీపీ వర్మ, కన్సల్టెంట్ డాక్టర్ మెహాక్ సింగ్లా వివరించారు.

'ఇది రాఖీ గిఫ్ట్'
రిస్క్ ఎదురైనా వైద్యులు విజయవంతంగా ఆపరేషన్​ను పూర్తి చేశారు. 2023 ఆగస్టు 10న కిడ్నీ మార్పిడి పూర్తి కాగా.. ప్రస్తుతం హరేంద్ర సాధారణ జీవనం సాగిస్తున్నాడు. ఉద్యోగానికి వెళ్లడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ప్రియాంక చేసిన పనిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. సోదరి ప్రియాంక తనకు అసలైన రక్షాబంధన్ కానుక ఇచ్చిందని హరేంద్ర హర్షం వ్యక్తం చేశాడు. తనకు అండగా ఉండి బలాన్ని ఇచ్చిందని చెప్పాడు. మరోవైపు, తన సోదరుడి ప్రాణాలు కాపాడినందుకు తనకు చెప్పలేనంత సంతోషంగా ఉందని ప్రియాంక పేర్కొంది.

Sister Kidney Donation to Brother
హరేంద్ర

ఇదిలా ఉండగా, కిడ్నీ దానం చేయడం వల్ల మహిళ గర్భధారణపై ఎలాంటి ప్రభావం ఉండదని వైద్యుడు పీపీ వర్మ వివరణ ఇచ్చారు. 'మహిళలు కిడ్నీ దానం చేస్తే ప్రెగ్నెన్సీ సమయంలో ఇబ్బందులు ఉంటాయని సమాజంలో తప్పుడు అభిప్రాయం ఉంది. నిజానికి కిడ్నీ దానం వల్ల మహిళల గర్భధారణకు ఎలాంటి సమస్య ఉండదు. చాలా మంది మహిళలు కిడ్నీ దానం చేసిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా తల్లులయ్యారు' అని డాక్టర్ స్పష్టం చేశారు.

మూత్రపిండంలో రాళ్లొచ్చాయని ఆస్పత్రికి వెళ్తే..​ కిడ్నీ మాయం!

'నాన్నకు ప్రేమతో'.. లాలూకు కిడ్నీ ఇవ్వనున్న కుమార్తె!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.