ETV Bharat / bharat

ఆఫ్తాబ్​కు 13 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ.. శ్రద్ధ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి!

Shraddha Murder Case : యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా వాకర్ హత్యకేసులో నిందితుడు అఫ్తాబ్​కు 13 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించారు. తదుపరి పాలిగ్రాఫ్​ పరీక్షల కోసం లీగల్​ ప్రక్రియను పోలీసులు ప్రారంభించారు.

shraddha murder case
shraddha murder case
author img

By

Published : Nov 26, 2022, 6:22 PM IST

Updated : Nov 26, 2022, 7:01 PM IST

Shraddha Murder Case: శ్రద్ధా వాకర్​ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్​కు 13 రోజుల జ్యుడిషియల్‌ ​ కస్టడీ విధించింది దిల్లీ కోర్టు. అఫ్తాబ్​కు తదుపరి పాలిగ్రాఫ్​ పరీక్షల కోసం లీగల్​ ప్రక్రియలను ప్రారంభించారు పోలీసులు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దర్యాప్తులో రోజురోజుకు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా మరో విషయం బయటకొచ్చింది. శ్రద్ధ శరీరాన్ని 35ముక్కలు చేసిన నిందితుడు అఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలా వాటిని ఫ్రీడ్జ్‌లో దాచాడు. అనంతరం అవి ఫ్రీడ్జ్‌లో ఉండగానే డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన మరో యువతిని ఫ్లాటుకు రప్పించుకున్నాడు.

ఈ నేపథ్యంలో ఆ యువతిపై దృష్టి సారించిన దర్యాప్తు వర్గాలు ఆమె ఓ వైద్యురాలని గుర్తించారు. శ్రద్ధాను పరిచయం చేసుకున్న యాప్‌ నుంచే సదరు వైద్యురాలితో అఫ్తాబ్‌ పరిచయం ఏర్పరచుకున్నట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. సైకాలజిస్టుగా పనిచేస్తున్న ఆమెను సంప్రదించి కేసుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. అఫ్తాబ్‌ డేటింగ్‌ యాప్‌ ద్వారా పలువురు యువతులతో సంబంధం కలిగి ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి వివరాలను తెలుసుకునేందుకు డేటింగ్‌ యాప్‌నకు దర్యాప్తు వర్గాలు నోటీసులు పంపాయి.

ఇంతకముందు పోలీసులు కస్టడీలో ఉన్న నిందితుడు అఫ్తాబ్‌ విచారణలో పొంతనలేని సమాధానాలు చెబుతుండటం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో అఫ్తాబ్‌కు ఈ నెల 28న నార్కొటిక్ పరీక్ష నిర్వహించే అవకాశముందని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే నార్కో టెస్టుకు ముందు చేసే పాలీగ్రాఫ్ పరీక్షను అధికారులు పూర్తి చేశారు. అఫ్తాబ్‌కు ప్రీ, మెయిన్, పోస్టు పరీక్షలు పూర్తైనట్లు రోహిణి ప్రాంతంలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరికి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పాలిగ్రాఫ్‌కు సంబంధించిన రికార్డ్స్‌ను పరిశీలించి తమ ఫోరెన్సిక్‌ నిపుణులు ఓ నివేదికను తయారు చేస్తారని ఆయన పేర్కొన్నారు. వాటిని దర్యాప్తు వర్గాలకు అందజేయనున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి: లోన్ ఎగ్గొట్టేందుకు భార్య హత్య.. మతిస్థిమితం లేని బాలికపై మైనర్ రేప్

దళితుడి మెడలో చెప్పుల దండ వేసి దారుణంగా కొట్టిన యువకులు

Last Updated : Nov 26, 2022, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.